Rajat Patidar : గాయం తీవ్రం రజత్ పాటిదార్ దూరం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్
Rajat Patidar : 16వ సీజన్ ఐపీఎల్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గాయాలు బాధిస్తున్నాయి ఆటగాళ్లను. ఐపీఎల్ లో ఇప్పటికే స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్ తగిలింది.
తాజాగా మరో కీలక ఆటగాడు రజత్ పాటిదార్(Rajat Patidar) గాయం కారణంగా తప్పుకున్నాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోలుకోలేని షాక్ తగిలింది. కీలకమైన ఆటగాడిగా ఉన్నాడు పాటిదార్.
ముంబై ఇండియన్స్ తో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో మంగళవారం కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆర్సీబీ తలపడనుంది. జట్టు మేనేజ్ మెంట్ కీలక ప్రకటన చేసింది. రజత్ పాటిదార్ గాయం కారణంగా ఆడడం లేదని ప్రకటించింది. దీంతో ఫాఫ్ డు ప్లెసిస్ సారథ్యంలోని ఆర్సీబీకి ఇది భారీ దెబ్బ అని చెప్పక తప్పదు. ఈడెన్ గార్డెన్ లో జరిగే మ్యాచ్ కు దూరం కావడం తనను బాధకు గురి చేసిందని వాపోయాడు రజత్ పాటిదార్.
త్వరగా కోలుకుంటాడని తదుపరి మ్యాచ్ లకు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నట్లు టీమ్ యాజమాన్యం ఆశా భావం వ్యక్తం చేసింది. రజత్ పాటిదార్ స్థానంలో వేరే ఎవరినీ ఎంపిక చేయాలని అనుకోవడం లేదని స్పష్టం చేసింది.
Also Read : స్టేడియంకు రానున్న రిషబ్ పంత్