Satya Pal Malik : ప్ర‌మాదంలో దేశం – స‌త్య పాల్ మాలిక్

ప్ర‌ధాని మోదీపై సంచ‌ల‌న కామెంట్స్

Satya Pal Malik : జ‌మ్మూ కాశ్మీర్ మాజీ గ‌వ‌ర్న‌ర్ స‌త్య పాల్ మాలిక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి దేశ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. గ‌త కొంత కాలంగా స‌త్య పాల్ మాలిక్ ధిక్కార స్వ‌రాన్ని వినిపిస్తూ వ‌స్తున్నారు. ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. దేశంలో జ‌రిగిన రైతుల ఆందోళ‌న‌కు బ‌హిరంగంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి సంచ‌ల‌నంగా మారారు. అనంత‌రం తాజాగా దేశ రాజ‌ధానిలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ ఆందోళ‌న చేప‌ట్టిన మ‌హిళా రెజ్ల‌ర్లకు బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

మోదీ ప్ర‌ధానిగా కొన‌సాగడం వ‌ల్ల దేశానికి ఎలాంటి ఉప‌యోగం లేద‌న్నారు. అంతే కాదు త‌ప్పుడు వ్య‌క్తి దీనిని అధిరోహించ‌డం వ‌ల్ల ఇబ్బందులు త‌ప్ప ఇంకేమీ ఒన‌గూరే అవ‌కాశం లేదంటూ మండిప‌డ్డారు. విచిత్రం ఏమిటంటే మాజీ గ‌వ‌ర్న‌ర్ తో పాటు మ‌రో స్వ‌రం భార‌తీయ జ‌న‌తా పార్టీకి కంట్లో న‌లుసుగా మారింది. ఆయ‌న ఎవ‌రో కాదు రాహుల్ గాంధీ త‌మ్ముడు ఎంపీ వ‌రుణ్ గాంధీ. స‌త్య పాల్ మాలిక్(Satya Pal Malik) తో క‌లిసి ప్ర‌తిసారి మోదీని, బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ ను ఏకి పారేస్తున్నారు.

ద్ర‌వ్యోల్బ‌ణం, పెరుగుతున్న నిరుద్యోగం దేశానికి ప్ర‌మాద‌మ‌ని హెచ్చ‌రించారు. దేశంలో వ‌న‌రుల‌న్నింటిని గంప గుత్త‌గా వ్యాపారులు, కార్పొరేట్ల‌కు అమ్ముకుంటూ లేదా లీజుకు ఇచ్చుకుంటూ పోతే చివ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు ఏం మిగులుతుంద‌ని ప్ర‌శ్నించారు. మొత్తంగా స‌త్య పాల్ మాలిక్ మ‌రోసారి సంచ‌ల‌నంగా మారడం విశేషం.

Also Read : Amit Shah Tour : భాగ్య‌న‌గ‌రానికి ట్ర‌బుల్ షూట‌ర్ రాక

 

Leave A Reply

Your Email Id will not be published!