PM Modi Blinken : మోదీ చరిష్మాకు బ్లింకెన్ ఫిదా
వాషింగ్టన్ డీసీ సమావేశంలో సన్నివేశం
PM Modi Blinken : మోదీ మరోసారి తన పవర్ ఏమిటో చూపించారు. అమెరికాలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఏ ఒక్క నిమిషం వృధా చేయలేదు. అమెరికా, భారత దేశాల మధ్య బంధం మరింత గట్టిగా ఉండాలని కోరారు. ఆ మేరకు వైట్ హౌస్ లో ఇచ్చిన ప్రత్యేక విందుకు హాజరైన మోదీ బైడెన్ దంపతులను మెస్మరైజ్ చేశారు. అద్భుతమైన కానుకలు ఇచ్చారు.
ప్రత్యేకించి జిల్ బైడెన్ కు మోదీ అందజేసిన వజ్రం విస్తు పోయేలా చేసింది. ఏ దేశానికి వెళ్లినా భారత దేశానికి సంబంధించిన వస్తువులను తీసుకు వెళ్లడం, అక్కడికి వారికి అందించడం పనిగా పెట్టుకున్నారు. ఇది నిజమైన భారతీయ సంస్కృతికి ప్రతిబింబమని చాలా సార్లు చెప్పారు ప్రధాన మంత్రి(PM Modi).
కాగా మోదీతో అమెరికాకు చెందిన పలువురు ప్రముఖులు , వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థల చైర్మన్లు, సిఇవోలు కలుసుకున్నారు. ప్రముఖ అంతరిక్ష సైంటిస్ట్ కూడా కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో అమెరికా లోని వాషింగ్టన్ డీసీలో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రత్యేకించి ప్రవాస భారతీయులు లెక్కకు మించి పాల్గొనడం విస్మయానికి గురి చేసింది. ఈ సందర్బంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇదే సమయంలో అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మోదీతో భేటీ కావడం విశేషం.
Also Read : Shashi Tharoor : డాక్టరేట్ అందుకున్న శశి థరూర్