KTR Kakatiya Textile Park : కాకతీయ టెక్స్ టైల్ పార్క్ సిద్దం
రెండు నెలల్లో కేసీఆర్ ప్రారంభం
KTR Kakatiya Textile Park : మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా త్వరలోనే కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ప్రారంభం కానుందని వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దీనిని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ వరంగల్ జిల్లాలో ఉంది. ఇది 1,350 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇది భారత దేశంలోనే అతి పెద్ద టెక్స్ టైల్ పార్క్ కావడం విశేషం.
దీనికి రాష్ట్రంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. ఇటు ఐటీ అటు ఫార్మా మరో వైపు లాజిస్టిక్ , టెక్స్ టైల్స్ ఇలా ప్రతి రంగంలో తెలంగాణను ముందంజలో ఉండేలా కృషి చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్రం పట్ల భవిష్యత్తు కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు కేసీఆర్. ఆయన దార్శనికత, ముందు చూపు వల్లే ఇవాళ భారీ ఎత్తున నిర్మాణానికి నోచుకుంది కాకతీయ టెక్స్ టైల్ పార్క్.
ఇప్పటికే నేత కార్మికులు యూనిట్లుగా ఏర్పడ్డారు. వాళ్లు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ టెక్స్ టైల్ పార్క్ వల్ల వేలాది మందికి ఉపాధి కల్పించనుంది. మరో వైపు కాకతీయ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ ఆఫ్ టెక్స్ టైల్ పార్క్ హన్మకొండ జిల్లా మడికొండ పల్లెలో కొలువై ఉంది. ఇది 60 ఎకరాలలో విస్తరించి ఉంది. 304 పవర్ లూమ్ యూనిట్లు ఉన్నాయి.
ఇదిలా ఉండగా మంత్రి కేటీఆర్(KTR) ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ సర్కార్ అభివృద్దిపై ఫోకస్ పెట్టిందని , కానీ విపక్షాలు అడ్డుకునేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు.
Also Read : Bandi Sanjay : దేవేందర్ గౌడ్ ను కలిసిన బండి
