CM KCR : ఏ పార్టీకి మేం బి టీమ్ కాదు – కేసీఆర్

కాంగ్రెస్, బీజేపీల‌పై షాకింగ్ కామెంట్స్

CM KCR : బీఆర్ఎస్ చీఫ్‌, తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేసీఆర్ నిప్పులు చెరిగారు. తాము ఎవ‌రికీ బీ – టీమ్ కాద‌ని అన్నారు. కాంగ్రెస్ , భార‌తీయ జ‌న‌తా పార్టీల‌పై మండిప‌డ్డారు కేసీఆర్. మాది ప‌క్కా రైతుల టీమ్ , కార్మికుల టీమ్ , పేద‌ల టీమ్ అని స్ప‌ష్టం చేశారు. భార‌త రాష్ట్ర‌ స‌మితి ప‌రివ‌ర్త‌న్ పార్టీ అని అన్నారు.

ఈ దేశాన్ని ఎవ‌రు భ్ర‌ష్టు ప‌ట్టించారో ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు కేసీఆర్. వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త ఆయా పార్టీల‌కే ద‌క్కింద‌న్నారు. దేశంలో ఏ పార్టీకి లేనంత మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు క‌లిగి ఉన్నార‌ని చెప్పారు సీఎం. బీఆర్ఎస్ ను అడ్డుకునే శ‌క్తి ఎవ‌రికీ, ఏ పార్టీకి లేద‌న్నారు కేసీఆర్(KCR). రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా ఏమిటో చూపిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

రాబోయే కాలంలో యుద్దం చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. త‌మ‌ను ఢీకొనే స‌త్తా ఏ ఒక్క పార్టీకి లేద‌ని ప్ర‌క‌టించారు. తాము రాబోయే 2024లో జ‌రిగే ఎన్నిక‌ల్లో ప‌వ‌ర్ లోకి రాక పోయినా ప్ర‌భుత్వ ఏర్పాటులో కీల‌క పాత్ర పోషిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా సీఎం చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేద‌న్నారు. ఇక బీజేపీ కులం పేరుతో, మ‌తం పేరుతో విద్వేషాలు సృష్టిస్తూ ఓట్ల‌ను కొల్ల‌గొట్టాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు.

Also Read : CM KCR : ఏ పార్టీకి మేం బి టీమ్ కాదు – కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!