Bandi Sanjay : కేబినెట్ లో చేరేందుకు బండి అనాసక్తి
కేవలం కార్యకర్తగా ఉంటానన్న ఎంపీ
Bandi Sanjay : కేంద్ర కేబినెట్ లో చేరేందుకు బండి సంజయ్ అనాసక్తి చూపుతున్నట్లు సమాచారం. బీజేపీ ఢిల్లీలో ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. గంటన్నరకు పైగా సాగింది. అయితే కొత్తగా బండి సంజయ్ ను తప్పించింది. దీనికి ముందు పెద్ద ఎత్తున కసరత్తు చేసింది బీజేపీ హై కమాండ్. పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా బండి సంజయ్(Bandi Sanjay) కుమార్ ను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే కీలక మార్పులు చేసింది.
విచిత్రం ఏమిటంటే తెలంగాణలో మోస్ట్ పవర్ పుల్ స్థాయిలో ఉన్న బీజేపీ స్టేట్ చీఫ్ కు కోలుకోలేని షాక్. ఆయన అయిష్టంగానే పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పుకునేందుకు ఒప్పుకున్నట్లు టాక్. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తనకు ఇన్నేళ్ల పాటు ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీకి, షాకు, జేపీ నడ్డాకు కృతజ్ఞతలు పేర్కొన్నారు.
కాగా బుధవారం జరిగిన కీలక మంత్రివర్గం సమావేశానికి కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఆయన కూడా అయిష్టంగానే బీజేపీ స్టేట్ చీఫ్ పదవికి ఒప్పుకున్నట్లు సమాచారం. మొత్తంగా కేబినెట్ లోకి బండిని తీసుకునేందుకు ఆఫర్ ఇచ్చినా దానిని తిరస్కరించినట్లు , కేవలం కార్యకర్తగా ఉంటానని స్పష్టం చేసినట్లు టాక్.
Also Read : Niharika Chaitanya : ప్లీజ్ మాక్కొంచెం ప్రైవసీ కావాలి
