Nara Chandrababu Naidu : టార్చ్ లైట్ టెక్నాలజీ నా పుణ్యమే
నారా చంద్రబాబు నాయుడు
Nara Chandrababu Naidu : టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ మధ్య తన గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నారు. విజన్ 2040 అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు. ఈ సందర్బంగా తన వల్లనే టెక్నాలజీ డెవలప్ అయ్యిందని చెబుతున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ లో ఐటీ రావడానికి, నగరం అభివృద్ది చెందడానికి తానే కారణమంటూ కామెంట్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
Nara Chandrababu Naidu Comments Viral
గురువారం ఏపీలోని మండపేటలో పర్యటించారు చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సెల్ ఫోన్లో టార్చ్ లైట్ టెక్నాలజీని పరిచయం చేసింది తానేనని స్పష్టం చేశారు. దీంతో అక్కడికి వచ్చిన వారంతా విస్తు పోయారు.
తాజాగా నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా కొట్టి పారేసింది వైసీపీ పార్టీ. ఇదేం రోగం అంటూ పేర్కొంది. రోజు రోజుకు చంద్రబాబు పవర్ కోసం ఎంతకైనా దిగజారేలా ఉన్నాడని ఈ కామెంట్స్ ను బట్టి చూస్తే అర్థమవుతుందని పేర్కొంటున్నారు. ఇక విజన్ 2040 సందర్బంగా మాట్లాడిన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంజనీరింగ్ చదవాలంటే బైపీసీ చేసి ఉండాలన్నారు. ఆయన తెలివికి అంతరూ విస్మయానికి గురయ్యారు.
Also Read : Ayutha Chandi Yagam : వైభవోపేతం అతిరుద్ర యాగం