Chandrababu Naidu : తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తాం
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu : టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పొత్తు అంటూ ఏ పార్టీతో ఉండదని స్పష్టం చేశారు టీడీపీ చీఫ్.
Chandrababu Naidu Words about Participation in Telangana
తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని, అన్ని స్థానాలలో పోటీ చేయాలా లేక కొన్ని స్థానాల్లో బరిలో ఉండాలా అన్న దానిపై పార్టీ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
మొత్తంగా తమ పార్టీ మాత్రం ఒంటరిగానే బరిలో ఉంటుందన్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వచ్చే ఏడాది లో జరగనున్న శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ అవసరాన్ని బట్టి పొత్తులు ఉండ బోతున్నాయని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu).
1983 నుండి నేటి దాకా తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ , నెట్ వర్క్ తెలంగాణలో ఉందని అన్నారు టీడీపీ చీఫ్. తాము రాబోయే ఎన్నికల్లో డిసైడ్ ఫ్యాక్టర్ గా ఉండ బోతున్నామని జోష్యం చెప్పారు. మొత్తం సీట్లు గెలవక పోయినా చాలా నియోకవర్గాలలో అభ్యర్థుల జయాపజయాలను ప్రభావితం చేయడం ఖాయమని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు.
Also Read : KL Rahul : రెండు మ్యాచ్ లకు రాహుల్ దూరం
