PM Modi : మోదీతో ఇట‌లీ ప్ర‌ధాని మెలోనీ భేటీ

చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం

PM Modi : న్యూఢిల్లీ – జి20 ప్ర‌త్యేక స‌మావేశం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతోంది. ప్ర‌పంచంలోని వివిధ దేశాల‌కు చెందిన నేత‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి ఇట‌లీ ప్ర‌ధాన మంత్రి జియోర్జియా మెలోనీ మ‌ర్యాద పూర్వ‌కంగా న‌రేంద్ర మోదీని క‌లుసుకున్నారు.

PM Modi Delhi G20 Summit

ఇందులో భాగంగా వాణిజ్యం, ర‌క్ష‌ణ‌, అభివృద్ది చెందుతున్న సాంకేతిక‌త‌లతో పాటు ప్రాధాన్య‌త క‌లిగిన రంగాల గురించి విస్తృతంగా చ‌ర్చించారు. ఈ విష‌యాన్ని ఆదివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) పంచుకున్నారు.

ప్ర‌పంచ శ్రేయ‌స్సు కోసం భార‌త దేశం , ఇట‌లీ దేశాలు క‌లిసి ప‌ని చేస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు మోదీ, మెలోనీ.
ప్ర‌స్తుతం ఉగ్ర‌వాదం యావ‌త్ ప్రపంచాన్ని భ‌య‌పెడుతోంద‌న్నారు. దీనిని స‌మ‌ర్థ‌వంతంగా ప్ర‌తి ఒక్క‌రం క‌లిసిక‌ట్టుగా ఎదుర్కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు ఇరు దేశాధినేత‌లు.

అంత‌కు ముందు ప్ర‌పంచ దేశాధి నేత‌లు రాజ్ ఘ‌ట్ ను సంద‌ర్శించారు. అక్క‌డ జాతిపిత మ‌హాత్మా గాంధీ స‌మాధి వ‌ద్ద‌కు వెళ్లారు. గాంధీకి ఘ‌నంగా నివాళులు అర్పించారు. వీరిలో ఇట‌లీ ప్ర‌ధాన మంత్రి మెలోనీ కూడా ఉన్నారు.

Also Read : RK Roja Selvamani : ప‌వ‌న్ కామెంట్స్ రోజా సెటైర్

Leave A Reply

Your Email Id will not be published!