Modi Govt Comment : సోష‌ల్ మీడియా పారా హుషార్

త‌లొగ్గిన కేంద్ర స‌ర్కార్

Modi Govt Comment : కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం ఉన్న‌ట్టుండి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. 145 కోట్ల ప్ర‌జ‌ల‌ను నిత్యం ప్ర‌భావితం చేస్తూ వ‌స్తున్న సోష‌ల్ మీడియా (సామాజిక మాధ్య‌మాలు) పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఎలాంటి పోస్టులు పెట్టినా లేక షేర్ చేసినా కేసులు అంటూ ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు 5 రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న త‌రుణంలో ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డం ఒకింత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. మ‌రో వైపు ముకుతాడు వేయాల‌ని చేసిన ప్ర‌య‌త్నాలు బెడిసి కొట్టాయా లేక రాజ‌కీయ వ్యూహంలో భాగంగా జ‌నం నుంచి వ్య‌తిరేక‌త రాకుండా ఉండేందుకు వెసులుబాటు కొంత కాలం ఇచ్చింద‌ని అనుకోవాలో తెలియ‌డం లేదు.

Modi Govt Comment Viral

ఇప్ప‌టి దాకా సామాజిక మాధ్య‌మాల‌లో పోస్టులు షేర్ చేసిన పాపానికి, లైకులు కొట్టినా, రీ ట్వీట్ లు చేసినా లేదా కేంద్ర స‌ర్కార్ కు, మోదీకి, ఆయ‌న ప‌రివారానికి , ప్ర‌త్యేకించి భార‌తీయ జ‌న‌తా పార్టీకి, దాని అనుబంధ సంస్థ‌లైన భ‌జ‌రంగ్ ద‌ళ్, ఏబీవీపీ, విశ్వ హిందూ ప‌రిష‌త్ , ఆర్ఎస్ఎస్ ల గురించి కానీ లేదా ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల గురించి ప్ర‌శ్నించినా లేదా నిల‌దీసినా , విమ‌ర్శ‌లు చేసినా, ఆరోప‌ణ‌లు గుప్పించినా ఏ మాత్రం క‌నిక‌రం లేకుండా కేసులు న‌మోదు చేస్తూ పోయారు. ఈ కేసుల ప‌రంప‌ర ఎంత దాకా వెళ్లిందంటే చివ‌ర‌కు అరెస్ట్ లు, దాడులు, చంప‌డాలు, ఆత్మ‌హ‌త్య‌ల‌కు పురికొల్పేంత‌లా చేశాయి.

ఒక ర‌కంగా భార‌త దేశంలో అత్య‌ధికంగా సోష‌ల్ మీడియాను వాడుకుంటున్న‌ది, దానిని ఆయుధంగా చేసుకుని ఆటాడిస్తున్న‌ది ఎవ‌రో కాదు మోదీ(Modi) ప‌రివారమే. బీజేపీకి మ‌రో పేరు కూడా ఉంది. అదేమిటంటే వాట్సాప్ యూనివ‌ర్శిటీ అని. ప్ర‌పంచంలోనే ఏ పార్టీకి ఇంతటి భారీ స్థాయిలో సోష‌ల్ నెట్ వ‌ర్క్ అనేది లేదు. ప్ర‌త్యేకించి ప్రింట్, ఎల‌క్ట్రానిక్ తో పాటు డిజిట‌ల్ మీడియా సైతం ఇవాళ మోదీ(Modi) క‌నుస‌న్న‌ల‌లో కొన‌సాగుతున్నాయి. ప్ర‌త్యేకించి ఒక 10 శాతం త‌ప్పితే అన్నీ మోదీ లేచిన‌ప్ప‌టి నుంచి రాత్రి నిద్ర పోయేంత దాకా వార్త‌ల వెల్లువ కొన‌సాగుతూ వ‌స్తున్న‌ది.

ఇది ప‌క్క‌న పెడితే తాజాగా కేంద్రం స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు జీవో కూడా విడుద‌ల చేసింది. సోష‌ల్ మీడియాకు సంబంధించి న‌మోదు చేసిన కేసులు , అరెస్ట్ లు ఇక నుంచి ర‌ద్ద‌వుతాయ‌ని , ఎవ‌రు పోస్టులు చేసినా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఒకందుకు ఇది మంచి ప‌రిణామం అని చెప్ప‌క త‌ప్ప‌దు. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ చంద్ర‌చూడ్ దెబ్బ‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్నారా అనే అనుమానం క‌లుగుతోంది. ఏది ఏమైనా స్వేచ్ఛ ఉండాల్సిందే..కానీ అప‌రిత‌మైతే, ప‌క్క దారి ప‌డితేనే ప్ర‌మాదం.

Also Read : Chamari Athapaththu : ‘చ‌మ‌రి’ ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్

Leave A Reply

Your Email Id will not be published!