Janasena BJP : హైదరాబాద్ – తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల నగారా మోగడంతో ఆయా పార్టీలు గెలవడంపై, పొత్తు పెట్టుకోవడంపై ఫోకస్ పెట్టాయి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఎలాగైనా సరే బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని చూస్తోంది. ప్రస్తుతం పార్టీ చీఫ్ గా ఉన్న కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, పార్టీ ఎంపీ లక్ష్మణ్ లు పొత్తుపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఎలాగైనా సరే ఆంధ్రాకు సంబంధించిన ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Janasena BJP Alliance
ఈ ఓటర్లంతా గంప గుత్తగా తమకు పడేలా ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు స్వయంగా జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నివాసంలో కలుసుకున్నారు. దేశ వ్యాప్తంగా పేరు పొందిన సర్వేలన్నీ గంప గుత్తగా బీజేపీకి సింగిల్ డిజిట్ కన్నా ఎక్కువ సీట్లు రావంటూ తేల్చేశాయి.
దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు పార్టీ హైకమాండ్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే బీజేపీ(BJP) బీసీ నినాదాన్ని ముందుకు తెచ్చింది. ఆ సామాజిక వర్గానికే సీఎం పదవి కట్టబెడతామంటూ ప్రకటించింది. దీంతో పవన్ కళ్యాణ్ కీలకంగా మారారు.
ఎలాగైనా సరే జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని , దీని వల్ల షెటిలర్ ఓటర్లను ఆకట్టు కోవచ్చని వ్యూహం పన్నారు. మరి ఎంత మేరకు వర్కవుట్ అవుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎటు తిరిగి బీజేపీ బీఆర్ఎస్ ను గెలిపించే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు లేక పోలేదు.
Also Read : Eatala Rajender : నా వద్ద ఏదీ దొరకదు – ఈటల
