Daggubati Purandeswari : బాబు రాక పురందేశ్వరి కేక
హైకోర్టు మధ్యంతర బెయిల్
Daggubati Purandeswari : అమరావతి – ఏపీ స్కిల్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిన్న విచారించిన కోర్టు మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రూ. 371 కోట్ల స్కాం కేసులో ప్రధాన పాత్ర పోషించాడంటూ ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ ఒక్క కేసే కాదు మరో రెండు కేసులు నమోదు చేయడం గమనార్హం. ఏపీ ఫైబర్ నెట్ , అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాంలో సైతం చంద్రబాబు నాయుడుకు పాత్ర ఉందంటూ కేసు నమోదు చేసింది సీఐడీ.
Daggubati Purandeswari Welcomed
52 రోజులకు పైగా స్కిల్ స్కాం కేసులో నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే స్క్వాష్ పిటిషన్ కొట్టి వేయడంతో బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఇంకా తీర్పు రాలేదు. కానీ ఏపీ హైకోర్టు అనారోగ్య రీత్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు జడ్జి వెల్లడించారు.
కంటి ఆపరేషన్ ఉందని ఆయన తరపు లాయర్ పేర్కొనడంతో మానవతా దృక్ఫథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జడ్జి తెలిపారు. ఈ సందర్బంగా కేవలం నాలుగు వారాల పాటు మాత్రమే బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు తీర్పుపై స్పందించారు బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari).
నోటీసులు ఇవ్వకుండా, విచారణ జరపకుండా బాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తాము గతంలోనే తప్పు పట్టామని స్పష్టం చేశారు . ఏది ఏమైనా బాబు బయటకు రావడాన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు బీజేపీ చీఫ్.
Also Read : Kaleshwaram Project ATM : కాళేశ్వరం ఏటీఎం వైరల్
