JP Nadda : కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎం
బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా
JP Nadda : సంగారెడ్డి – మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను కేసీఆర్ సర్కార్ అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. అభివృద్ది చేయాల్సింది పోయి అప్పుల కూపీలోకి తోసి వేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము పవర్ లోకి వస్తే ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని ఆరోపించారు.
JP Nadda Comments about Kaleshwaram
కల్వకుంట్ల కుటుంబం దోపిడీకి కేరాఫ్ గా మారిందన్నారు. కేసీఆర్ పాలనలో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అంటున్నాడని, ఇదంతా కేవలం ఓటు బ్యాంకు కోసమేనని మండిపడ్డారు జేపీ నడ్డా(JP Nadda). బీజేపీ అధికారంలోకి వస్తే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసేస్తామని ప్రకటించారు.
బీఆర్ఎస్ అంటే భారత రాక్షస సమితి అంటూ ఎద్దేవా చేశారు. ధరణి పేరుతో పేదల భూములు లాక్కున్నారంటూ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంగా మారిందన్నారు. రూ. 38 వేల కోట్లతో నిర్మించాల్సిన సదరు ప్రాజెక్టును లక్ష కోట్లకు పైగా పెంచారంటూ ధ్వజమెత్తారు జేపీ నడ్డా.
Also Read : Revanth Reddy : ఇందిరమ్మ రాజ్యం తథ్యం