Revanth Reddy : రైతు ‘బంద్’ కు మామా అల్లుడే కారణం
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్
Revanth Reddy : హైదరాబాద్ – రైతు బంధును తాము అడ్డు కోలేదని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). సీఎం కేసీఆర్ అతి తెలివి , అల్లుడు హరీశ్ రావు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే ఈ పథకం ఆగి పోయిందన్నారు. ఈ విషయాన్ని స్పష్టంగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొందని , జారీ చేసిన ఉత్తర్వులలో స్పష్టం చేసిందని అన్నారు.
Revanth Reddy Comments on KCR and Harish Rao
రేవంత్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మరో వైపు కేసీఆర్, తన్నీరు ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ నిర్వాకం వల్లనే రైతు బంధు ఆగి పోయిందని ఆరోపించారు. దీనిని తీవ్రంగా తప్పు పట్టారు రేవంత్ రెడ్డి.
తాము ఓడి పోతామని తెలిసి పోయిందని, భయం పట్టుకుందని అందుకే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. వారం రోజులు ఆగితే తమ సర్కార్ వస్తుందని, వెంటనే రైతుల ఖాతాల్లో తాము చెప్పిన విధంగా జమ చేస్తామని స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు పన్నినా వర్కవుట్ కాదన్నారు రేవంత్ రెడ్డి.
ఈసీ అనుమతి ఇచ్చినా హరీశ్ రావు నోటి దూల, కేసీఆర్ అతి తెలివి వల్లనే రైతు బంధు ఆగి పోయిందని పేర్కొన్నారు. వీరి నిర్వాకం కారణంగానే రైతుల ఖాతాల్లో పడాల్సిన రూ. 5 వేల కోట్లు ఆగి పోయాయని ఆరోపించారు రేవంత్ రెడ్డి. గులాబీ నేతలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
Also Read : Vijaya Shanti : మోసానికి చిరునామా కేసీఆర్ పాలన
