Sheikh Hasina : బాంగ్లాదేశ్ అల్లర్లపై మాజీ ప్రధాని ‘షేక్ హసీనా’ కీలక ఆడియో వైరల్

రైఫిల్స్‌తో కాల్పులు జరిపినట్టు ఆరోపణలు వచ్చాయి...

Sheikh Hasina : బంగ్లాదేశ్‌లో గత ఏడాది కోటా వ్యవస్థపై జరిగిన విద్యార్థుల ఉద్యమ సమయంలో, అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా నిరసనకారులపై కాల్పులు జరపాలని పోలీసులకు స్పష్టంగా ఆదేశించిన లీక్‌డ్‌ ఆడియో ఒకటి దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బీబీసీ ఆధారంగా కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ అంశాన్ని వెల్లడించాయి.

Sheikh Hasina Voice Viral

2024 జూలై 18న గణభవన్ నుంచి ఒక సీనియర్ పోలీస్ అధికారికి హసీనా (Sheikh Hasina) ఫోన్ ద్వారా ఇచ్చిన ఆదేశాలు ఈ ఆడియోలో వినిపిస్తున్నట్లు సమాచారం. “ఎక్కడ అవసరమైతే అక్కడ ఆయుధాలు వాడండి… వారెక్కడ కనిపించినా కాల్చేయండి” అంటూ ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. ఆ ఆదేశాల తరువాత, ఢాకా సహా అనేక ప్రాంతాల్లో పోలీసులు మిలిటరీ గ్రేడ్ రైఫిల్స్‌తో కాల్పులు జరిపినట్టు ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘర్షణల్లో 1,400 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఐదు ప్రధాన యూనివర్శిటీ జోన్లు, సమీప జిల్లాలు పోలీసుల చర్యలతో తడిసి ముద్దయ్యాయి. బీబీసీతో పాటు ఇతర సంస్థలు ఆడియోను ధృవీకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

హసీనా పై న్యాయ చర్యలు

ఈ ఘటనల తరువాత హసీనా ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో అజ్ఞాతవాసం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్ అంతర్జాతీయ న్యాయ ట్రైబ్యునల్ షేక్ హసీనాకు (Sheikh Hasina) కోర్టు ధిక్కరణ కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

మాజీ నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం, ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపేందుకు హసీనాను తిరిగి దేశానికి రప్పించడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు, జాతీయ, అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు ఈ అంశంపై తీవ్ర నిరసనలు తెలుపుతున్నాయి.

కోటా వ్యతిరేక ఉద్యమం నేపథ్యం

బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా వ్యవస్థను విస్తరించడంపై విద్యార్థులు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీనికి ప్రత్యుత్తరంగా హసీనా ప్రభుత్వ విధానాలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఆ సమయంలో జరిగిన ఘర్షణలే ఈరోజు అంతర్జాతీయంగా వివాదాస్పదంగా మారాయి.

లీకైన ఆడియోతో బంగ్లా రాజకీయాలు మరోసారి ఉత్కంఠకు గురవుతున్నాయి. హసీనా పాలనలో జరిగిన ఈ ఘటనలు ప్రజాస్వామ్య విలువలపై గంభీర ప్రశ్నలు తలెత్తిస్తున్నాయి. అటు దేశీయంగా, ఇటు అంతర్జాతీయంగా హసీనా విధానాలపై విమర్శలు మరింత ముదురుతున్నాయి.

Also Read : Indian Nurse Nimisha : జూలై 16న కేరళ నర్సు ‘నిమిష ప్రియ’ యెమెన్ లో ఉరిశిక్ష

Leave A Reply

Your Email Id will not be published!