PM Narendra Modi: ట్రంప్‌ టారిఫ్‌ ల వేళ పుతిన్‌ కు ప్రధాని మోదీ ఫోన్‌

ట్రంప్‌ టారిఫ్‌ ల వేళ పుతిన్‌ కు ప్రధాని మోదీ ఫోన్‌

PM Narendra Modi : అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ షాకిచ్చారు. అమెరికా-భారత్‌ల మధ్య నెలకొన్న టారిఫ్‌ల వివాదంతో రష్యాతో వాణిజ్య సంబంధాలకే మోదీ జై కొట్టారు. శుక్రవారం రష్యా అధ్యక్షడు పుతిన్‌క స్వయంగా ఫోన్‌ చేసిన మోదీ (PM Narendra Modi).. భారత్‌-రష్యాల మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలపై ఆయనతో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు సంబంధించి తాజా పరిస్థితులను ప్రధాని మోదీ కి పుతిన్‌ (Putin) వివరించినట్లు తెలిసింది. ఈ సంక్షోభం ముగింపునకు శాంతియుత చర్చలే పరిష్కార మార్గమని భారత్‌ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

భారత్‌-రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపైనా ఇరువురు నేతలు చర్చించారు. ఇరుదేశాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు తమ నిబద్ధతను చాటుకున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా 23వ భారత్‌-రష్యా వార్షిక సదస్సులో భాగంగా ఈ ఏడాది చివరలో భారత్‌లో పర్యటించాలని పుతిన్‌కు ప్రధాని మోదీ ఆహ్వానించినట్లు పీఎంవో వెల్లడించింది. అయితే, రష్యా నుంచి చమురు కొనుగోలు నేపథ్యంలో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాలు విధించిన వేళ ప్రధాని మోదీ పుతిన్‌తో సంభాషించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 23వ భారత-రష్యా వార్షిక సదస్సుకు హాజరుకావాలని మోదీ ఆహ్వానం పలికారు.

PM Narendra Modi – అమెరికా ఆయుధాల కొనుగోలుకు భారత్‌ విముఖత

అగ్రరాజ్యం నుంచి కొత్త ఆయుధాలను, వైమానిక విమానాలను కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ క్రమంలోనే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తన అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. ట్రంప్‌ భారత్‌పై విధించిన భారీ సుంకాలతో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండో దఫా పాలనలో అమెరికా, భారత్‌ మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయిభారత్‌ మిత్రదేశమే అయినా అమెరికాతో వాణిజ్యం అనుకున్నంత సంతృప్తిగా జరగడం లేదని… పైగా రష్యాతో చమురు కొనుగోళ్లు జరుపుతోందంటూ ట్రంప్‌ గతంలో 25 శాతం టారిఫ్‌ విధించారు. ఆపై అగష్టు 6వ తేదీన… తాను చెప్పినా వినలేదంటూ మరో 25 శాతం సుంకాలు ప్రకటించారు.

రష్యాతో చమురు ఒప్పందాలు ఆగేది లేదని భారత్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. అదే సమయంలో.. రాజీ పడేది లేదని, సుంకాలతో భారీ మూల్యం చెల్లించేందుకైనా సిద్ధమని భారత ప్రధాని మోదీ ప్రకటించారు. అమెరికా సుంకాలపై అటు రష్యా, ఇటు అనూహ్యంగా చైనా భారత్‌ కు మద్ధతుగా నిలిచాయి. ఈ క్రమంలో.. భారత ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటిస్తుండగా, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌ పర్యటనకు వస్తుండడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ప్రత్యేకంగా పుతిన్‌కు ఫోన్‌ చేసి మోదీ ఆహ్వానించి ట్రంప్‌కు ఊహించని షాకిచ్చారు మోదీ.

Also Read : India Union Government: పౌరసత్వం వదులుకుంటున్న భారతీయులు ! కారణమేమిటంటే ?

Leave A Reply

Your Email Id will not be published!