Rahul Gandhi: తన పెళ్లిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశక్తికర వ్యాఖ్యలు
తన పెళ్లిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశక్తికర వ్యాఖ్యలు
Rahul Gandhi : తన పెళ్లి విషయంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ తో మాటామంతీ కొనసాగుతోందని తెలిపారు. ‘ఓటర్ అధికార్ యాత్ర’లో భాగంగా బిహార్‌లోని అరారియాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, రాహుల్ గాంధీ మధ్య ఈమేరకు సంభాషణ సాగింది.
Rahul Gandhi Interesting Comments
‘ఓటర్ అధికార్ యాత్ర’లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ… కేంద్రమంత్రి, ఎల్జేపీ (రామ్‌విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ ఇక పెళ్లి చేసుకోవాలంటూ సూచించారు. ఈ క్రమంలోనే పక్కనే కూర్చున్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) వెంటనే మైక్ అందుకుని.. ‘ఈ సూచన నాకూ వర్తిస్తుంది.’ అని వ్యాఖ్యానించారు. ‘ఇదే విషయాన్ని మా నాన్న ఎప్పటినుంచో చెబుతున్నారు కదా’ అని తేజస్వీ బదులిచ్చారు. ‘అవును. దీనిపై ఆయనతో చర్చలు కొనసాగుతున్నాయి’ అని రాహుల్ బదులిచ్చారు. ఈ సరదా సంభాషణతో అక్కడ నవ్వులు విరబూశాయి.
రాహుల్ గాంధీ పెళ్లిపై రెండేళ్ల క్రితం పట్నాలో లాలూప్రసాద్ యాదవ్ తనదైన శైలిలో నవ్వులు పూయించిన సంగతి తెలిసిందే. ‘‘మా మాట విను.. పెళ్లి చేసుకో. మేమంతా నీ బరాత్ కు రావాలనుకుంటున్నాం. వివాహానికి విముఖత చూపుతుండటంతో మీ అమ్మ (సోనియా గాంధీ) ఆందోళన చెందుతోంది’’ అని వ్యాఖ్యానించారు. తాజా సమావేశంలో ఇదే విషయాన్ని రాహుల్ ప్రస్తావనకు తీసుకొచ్చినట్లు సమాచారం.
Also Read : Sena Tho Senani: “సేనతో సేనాని” పేరుతో విశాఖ వేదికగా జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం
