న్యూఢిల్లీ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత దేశ ప్రజలను ఉద్దేశించి బంగారం కొనుగోలు చేయొద్దని, ఇంటి నుండి పని చేయాలని , పొదుపు పాటించాలని, విద్యుత్ ఆదా చేయాలని సూచించడం సంచలంగా మారింది. ప్రధానిగా ఒకరికి చెప్పే ముందు నువ్వు పాటించాలని పెద్ద ఎత్తున విమర్శలు, ట్రోల్స్ సోషల్ మీడియా వేదికగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ స్వామీజీ స్వామి అవిముక్తేశ్వరానంద సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీపై. ఆయన కీలక సూచనలు కూడా ఇచ్చారు. ఒక దేశానికి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మీరు ఇలా మాట్లాడటం మంచిది కాదన్నారు .
ప్రధానమంత్రి ముందుగా 8,000 కోట్ల రూపాయల విలువైన ఖరీదైన విమానాన్ని అమ్మేయమని చెప్పారు. ధర్మం ఇంటి నుంచే మొదలవుతుందని ఆయన అన్నారు. ఇవాళ స్వామి అవిముక్తేశ్వరానంద మీడియాతో మాట్లాడారు. ప్రజలను ఖర్చులు తగ్గించుకోమని చెప్పడం కాదు. ముందుగా ఆ విమానాన్ని అమ్మేయాలన్నారు. ప్రధానమంత్రి విమానాన్ని అమ్మక పోయినా పర్వాలేదు. కనీసం తమ సొంత కాన్వాయ్‌ను, మంత్రుల కాన్వాయ్‌లను, సహాయ మంత్రుల కాన్వాయ్‌లను తగ్గించడం ద్వారా అయినా దేశానికి అపారమైన మేలు చేసినవారవుతారని హితవు పలికారు స్వామి అవిముక్తేశ్వరానంద. ఈ సలహాను ప్రజలు ఇప్పటికే ఇస్తున్నారని గుర్తు చేశారు.
పనిలో భాగంగా కార్మికుల సమావేశాలను ఆన్లైన్లో నిర్వహిస్తే, కార్మికులకు భారీగా డబ్బు ఆదా అవుతుందనే చర్చ కూడా జరుగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా స్వామి ప్రధానిని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గత కొంత కాలంగా మోదీ నిర్వాకంపై భగ్గుమంటున్నారు.