హైదరాబాద్ : తెలంగాణలో పటిష్ట స్థితిలో ఉన్న బీజేపీకి ఉన్నట్టుండి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు పోక్స్ కేసు నిర్వాకం తలనొప్పిగా మారింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించే బీజేపీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , ప్రభావితమైన నాయకులు, మహిళా నాయకురాళ్లు నోరు మెదపడం లేదు. మౌనంగా ఉన్నారు. ఇక స్పష్టత ఇవ్వాల్సిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వింతగా మాట్లాడారు. ఆయనకు కొడుకుకు పార్టీకి ఏం సంబంధం ఉందంటూ ప్రశ్నించడం మరింత డ్యామేజ్ ను కలిగించింది. ఈ తరుణంలో రాష్ట్రంలో భారీగా డ్యామేజ్ అయిన బీజేపీని సరిదిద్దే ప్రయత్నం చేస్తోంది బీజేపీ హైకమాండ్. ఇక కేంద్రంలో కీలక పోస్టులో ఉన్న కిషన్ రెడ్డి సైతం తప్పించుకునే ప్రయత్నం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో ఇప్పుడు బండి కొడుకు వ్యవహారం సంచలనంగా మారింది.
దీంతో డ్యామేజ్ కాకుండా ఉండేందుకు తక్షణమే కేంద్ర మంత్రి వర్గం నుంచి బండి సంజయ్ కుమార్ పటేల్ ను తప్పించడం తప్పితే మరో మార్గం లేదు. ఈ తరుణంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో భారీ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశమున్నట్లు ఢిల్లీ భారతీయ జనతా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన పలువురు నాయకుల పేర్లు చర్చకు వస్తుండగా, తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు సమాచారం. ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి అప్పగించే ఛాన్స్ ఉంది.
