మిత్ర ధ‌ర్మాన్ని పాటించాలి మ‌ళ్లీ ప‌వ‌ర్ లోకి రావాలి

కార్య‌క‌ర్త‌ల‌కు దిశా నిర్దేశం చేసిన సీఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు స‌ర్ ప్ర‌క్రియ‌పై. మంగ‌ళ‌వారం పార్టీ కేంద్ర కార్యాల‌యంలో కార్య‌క‌ర్త‌ల‌కు స‌ర్ పై వ‌ర్క్ షాప్ చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. చర్చలు జరగాలి.. కార్యకర్తలు చర్చల్లో భాగస్వామ్యం కావాల‌ని స్ప‌ష్టం చేశారు. అధికార ఫలితాలు కార్యకర్తలకు అందించాలన్నారు. క్షేత్ర స్థాయిల్లో కొన్ని చోట్ల మిత్రపక్షాలు ఉండక పోవచ్చ‌న్నారు. అయినా వారిని కూడా కలుపుకుని వెళ్లాలి అన్నారు. 2024 ఎన్నికలకంటే ఎక్కువగా మిత్రపక్షాలతో పని చేయాలని ఆదేశించారు . మిత్రధర్మాన్ని ప్రతి నేతా, ప్రతి కార్యకర్తా పాటించాల్సిందేన‌ని అన్నారు. SIRపై మూడు పార్టీలతో కో-ఆర్డినేషన్ కమిటీ కూడా వేస్తాం అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. జులై 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు ఇంటింటి ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు.

రెండేళ్లల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని కోరారు. 45 రోజుల్లో ఇంటింటి ప్రచారం చేపట్టాలి.. పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాలన్నారు. ఈ ఇంటింటి ప్రచారంలో నేను కూడా పాల్గొంటానని ప్ర‌క‌టించారు . ఈ ఇంటింటి ప్రచారంలో సైకిళ్ల మీద వెళ్లి ప్రజలను కలవాలని స్ప‌ష్టం చేశారు చంద్ర‌బాబు నాయుడు. వీలుంటే ఈ-సైకిళ్లపై ప్రచారం చేపట్టాలి. నేను కూడా సైకిల్ మీదే ప్రచారం చేస్తానని అన్నారు.. ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.. నేను నాలుగోసారి సీఎంగా ఉన్నానని చెప్పారు. వీటితో పాటు మన ప్రభుత్వాలు సాధించిన ప్రగతిపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాల‌న్నారు. ఈ నెల 21వ తేదీన యోగా డే నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు. అమ‌రావ‌తి కేంద్రంగా 25 వేల మందికి పైగా పాల్గొంటార‌ని చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!