అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆక్వా పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉందన్నారు . దీని మీద ఆధారపడిన వాళ్లు ఎందరో ఉన్నారని పేర్కొన్నారు. సీ-ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్ షాప్లో పాల్గొని ప్రసంగించారు. వికసిత్ భారత్ లక్ష్యాలు చేరుకోవడానికి బ్లూ ఎకానమీ ఎంతో కీలకం అని స్పష్టం చేశారు సీఎం. పాండ్ టు పోర్టు, ఫార్మర్ టు గ్లోబల్ కన్స్యూమర్, బ్లూ ఎకానమీ టు వికసిత్ భారత్ అనే విధానంతో పని చేయాలని పిలుపునిచ్చారు. భారత ఆశలను… ఆశయాలను నెరవేర్చేందుకు ఏపీ బ్లూ ఎకానమీ దోహదప డుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఆక్వా పరిశ్రమలో ఇన్నోవేషన్లు చేసే వారిని ఆంధ్రప్రదేశ్ ఆహ్వానిస్తోందని చెప్పారు .
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ఏపీ పని చేస్తోందని వెల్లడించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఆ పెట్టుబడులకు ప్రోత్సాహమిచ్చి అభివృద్ధి చేస్తాం అన్నారు. ఆక్వా ఉత్పత్తులతో చక్కటి ఆరోగ్యం లభిస్తుందన్నారు. ప్రజలు ఇప్పుడు ప్రొటీన్ ఉత్పత్తులనే ఆహారంగా తీసుకుంటున్నారని తెలిపారు. ఆక్వా ఉత్పత్తుల్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుందని స్పష్టం చేశారు . ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడంతోపాటు… ప్రతీ రోజూ సైకిలింగ్ చేయాలని పిలుపునిచ్చారు. సైకిలింగ్ ద్వారా ఆరోగ్యం బాగుంటుందని, ఖర్చులూ తగ్గుతాయన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
