జర్మనీలో ఘనంగా తెలుగుదేశం మినీ మహానాడు

ఎన్టీఆర్ 103 వ జయంతి వేడుకలు

జ‌ర్మ‌నీ : జర్మనీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వ‌ర్యంలో మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన, మా తెలుగు తల్లికి గీతాలాపనలతో కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ కుమారుడిగా జన్మించటం తన అదృష్టమని అన్నారు. కుటుంబం కంటే ప్రజలకే ఎన్టీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారిని పేర్కొన్నారు. తెలుగు నేలపై చెరగని చిరునామా ఎన్టీఆర్. సినిమాల్లో నటించినా, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చినా ఏది చేసినా ప్రజా హితం, సంచలనమే. సంక్షేమ రాజ్యాన్ని స్థాపించి, సామాజిక న్యాయాన్ని చిత్తశుద్ధి తో అమలు చేసిన ఘనత మా నాన్న ఎన్టీఆర్ కే చెల్లింద‌న్నారు,

మహిళలకు ఆస్తిలో హక్కునేకాదు రాజ్యాధికారాన్నీ కట్టబెట్టిన ఘనత ఎన్టీఆర్ కు, సీఎం చంద్రబాబులకు దక్కుతుందని గళ్లా మాధవి అన్నారు. దానికి తానే ఉదాహరణ అని పేర్కొన్నారు. బీసీలకు అసలైన స్వాతంత్ర్యం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది. బ్యాక్ వార్డ్ క్లాసెస్‌గా పిలుస్తూ అణచివేతకు గురవుతున్న బీసీలను సమాజానికి బ్యాక్ బోన్ క్లాసెస్ అని గుర్తించి, వెన్నుతట్టి ప్రోత్సహించింది తెదేపానేనని అన్నారు. కూటమి ప్రభుత్వ 24 నెలల పాలనలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి పథంలో 20 ఏళ్ల ముందుకు సాగిందని మన్నవ సుబ్బారావు అన్నారు. అవినీతి, అరాచకం విధ్వంసంతో సాగిన జగన్ పాలనకు ప్రజలు ఓటు అనే ఆయుధంతో పోటు పొడిచారని, చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని స్పష్టం చేశారు. మే 28 ఎన్టీఆర్ పుట్టినరోజు మాత్రమే కాదు ప్రజాస్వామ్యనికి కొత్త అర్ధం చెప్పిన రోజు. లక్షలాది మంది కార్యకర్తల ఆత్మీయ కలయిక. తెలుగుదేశం మూడు తరాల ప్రస్థానం, స్థాపన, స్థిరీకరణ, సరికొత్త దిశగా మార్పు చెందింది. అభివృద్ధి, సంక్షేమం, పాలనా సంస్కరణలతో కూటమి ప్రభుత్వం సరికొత్త రికార్డులు నెలకొల్పుతోందని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!