ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టులో కీల‌క మార్పులు

చేయాల‌ని భావిస్తున్న యాజ‌మాన్యం

ముంబై : ప్ర‌పంచంలోనే అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో 2025, 2026 18,19వ మెగా సీజ‌న్ల‌లో అత్యంత పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో నిరాశ‌కు గురి చేసింది ముంబై ఇండియ‌న్స్. ఆ జ‌ట్టు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాతో పాటు ఇత‌ర ఆటగాళ్లు ఎవ‌రూ కూడా ఆశించిన మేర రాణించ‌లేక పోయారు. ఒక‌టి రెండు మ్యాచ్ లు మాత్రమే గెలుపొంది పాయింట్ల ప‌ట్టిక‌లో ఈఏడాది జ‌రిగిన సీజ‌న్ లో ఆఖ‌రున నిలిచింది. ప‌రువు పోగొట్టుకుంది. రోహిత్ శ‌ర్మ‌, పాండ్యా, తిల‌క్ వ‌ర్మ లాంటి ఆటగాళ్లు ఉన్న‌ప్ప‌టికీ ఎక్క‌డా త‌మ‌దైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించ‌లేక పోయింది.

దీంతో ముంబై ఇండియ‌న్స్ యాజ‌మాన్యం దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది. ఆ జ‌ట్టుకు ప్ర‌ముఖ వ్యాపార దిగ్గ‌జ సంస్థ రిల‌య‌న్స్ గ్రూప్ ఓన‌ర్ గా ఉంది. ముఖేష్ అంబానీ స‌తీమ‌ణి నీతా అంబానీ దీనికి అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా జ‌ట్టు ప‌ర్ ఫార్మెన్స్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాజాగా విశ్వ‌స‌నీయ వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం మేర‌కు గత కొన్నేళ్లుగా జట్టు ప్రదర్శనలతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఏమాత్రం సంతోషంగా లేదు. వారు ఇప్పుడు ఐపీఎల్ 2026–27 సీజన్ కోసం ఒక కొత్త యువ జట్టును నిర్మించాలని కోరుకుంటున్నారు.

నివేదికల ప్రకారం, హార్దిక్ పాండ్యా , సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ వచ్చే సీజన్‌కు ముందే ముంబై ఇండియన్స్‌ను వీడనున్నారు.ముంబై ఇండియన్స్ ఒక పెద్ద ట్రేడ్ డీల్‌లో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. ఈ ట్రేడ్ పూర్తయితే, ఇది ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్‌గా నిలిచే అవకాశం ఉంది. వచ్చే సీజన్‌కు తిలక్ వర్మను కెప్టెన్‌గా నియమించనుంది. అయితే, మరో జట్టు నుండి ఒక ఆటగాడు వచ్చి ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయితే, అది ఆశ్చర్యం కలిగించక పోదు.

Leave A Reply

Your Email Id will not be published!