త‌మిళ‌నాడు ప్ర‌యోజనాలు అత్యంత ముఖ్యం

దేశ నిర్మాణంలో పాలు పంచుకుంటాం

న్యూఢిల్లీ : త‌మిళ‌నాడు నూత‌న ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న త‌న త‌మిళ ప్ర‌జ‌ల త‌ర‌పున త‌న‌దైన గొంతు వినిపించారు. దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ అధ్య‌క్ష‌త‌న 11వ నీతి ఆయోగ్ కీల‌క స‌మావేశం జ‌రిగింది. భార‌త దేశంలోని ఆయా రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య‌మంత్రులంతా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్రశేఖ‌ర్ త‌న వాణిని బ‌లంగా వినిపించే ప్ర‌య‌త్నం చేశారు. ఓ వైపు త‌మ ప్రాంతానికి చెందిన భూమి పుత్రుడు , దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా మృతి చెంద‌డంతో ఆయ‌న తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున అంతిమ సంస్కారాల‌ను జ‌రిపించారు. అక్క‌డి నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు సీఎం విజ‌య్.

నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రసంగిస్తూ అనేక డిమాండ్లను లేవనెత్తారు.నీట్ నుండి మినహాయింపు ఇవ్వాల‌ని కోరారు. 12వ తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించేదుకు ఛాన్స్ ఇవ్వాల‌న్నారు సీఎం. ఎటువంటి షరతులు లేకుండా రూ. 3,284 కోట్ల సమగ్ర శిక్షా నిధులను విడుదల చేయాల‌ని విన్న‌వించారు. తమిళనాడు మత్స్యకారుల రక్షణ, వారి సంప్రదాయ చేపల వేట హక్కులను కాపాడటం, జనాభా పెరుగుదలను నియంత్రించిన రాష్ట్రాలకు గుర్తించాల‌న్నారు సీఎం. చెన్నై నుండి కన్యాకుమారి వరకు హై-స్పీడ్ రైల్ కారిడార్; కోయంబత్తూర్‌లో రెండవ ఎయిమ్స్ ఏర్పాటు చేయాల‌న్నారు. అంతే కాకుండా తిరుక్కురళ్‌ను జాతీయ సాహిత్యంగా ప్రకటించాల‌ని డిమాండ్ చేశారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్.

Leave A Reply

Your Email Id will not be published!