బీజేపీకి జిరాక్స్ కాపీ లాగా వ్య‌వ‌హ‌రిస్తున్న సీఎం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన డీఎంకే నాయ‌కులు

చెన్నై : త‌మిళ‌నాడులో కొలువు తీరిన సీఎం విజ‌య్ కూట‌మి స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన డీఎంకే నేత‌లు. విజయ్‌పై ప్రత్యర్థులైన జి. బాబు జయకుమార్ , డి. శేకర్ విమర్శలు చేయ‌డం క‌ల‌కలం రేపింది. ఇదిలా ఉండ‌గా డీఎంకే మహిళా విభాగం సమావేశంలో మాజీ సీఎం , డీఎంకే పార్టీ చీఫ్ స్టాలిన్ మాట్లాడారు . విజయ్ కేవలం బీజేపీకి ‘జెరాక్స్ కాపీ’లా వ్యవహరిస్తున్నారని, తానే స్వయంగా ‘పట్టు కోల్పోయిన శక్తి’ అని అభివర్ణించిన పార్టీ (ఏఐఏడీఎంకే) నుండే ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని ఆరోపించారు. ఇది ఏ ర‌క‌మైన ప్ర‌జాస్వామ్యం అని ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీలు ఏమ‌య్యాయో చెప్పాల‌ని నిల‌దీశారు.

ఇదిలా ఉండ‌గా డీఎంకేతో పాటు అన్నాడీఎంకే ప్ర‌దాన కార్య‌ద‌ర్శి ఎడ‌ప్పాడి కె. ప‌ళ‌ని స్వామి , ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు ఉద‌య‌నిధి స్టాలిన్ సైతం సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ను ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ తాను ముఖ్య‌మంత్రిగా కొలువు తీరాక బిజీగా ఉన్నారు. తాను ఒక కంపెనీకి సీఈఓ ఎలా అయితే ప‌ని చేస్తారో అలాగే ఠంఛ‌నుగా 10 గంట‌ల కంటే ముందే స‌చివాల‌యానికి చేరుకుంటున్నారు. ఆయ‌న రావ‌డం ప్రారంభం కావ‌డంతో ఉద్యోగుల‌లో ఆందోళ‌న మొద‌లైంది. గ‌తంలో స‌మ‌య పాల‌న పాటించే వారు కాదు. అంతెందుకు ఎప్పుడో కానీ సీఎం కార్యాల‌యానికి వ‌చ్చే వారు కాదు. కానీ విజ‌య్ వ‌చ్చాక సీన్ మారింది. సిట్యూయేష‌న్ కూడా మారి పోయింది. పూర్తి పార‌ద‌ర్శ‌క‌త ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Leave A Reply

Your Email Id will not be published!