హైదరాబాద్ : ప్రముఖ నటి సమంత రుత్ ప్రభు సంచలన వ్యాఖ్యలు చేసింది. తను అక్కినేని నాగ చైతన్యతో విడి పోయాక దర్శకుడు రాజ్ నిడుమూరుతో పెళ్లి చేసుకుంది. ఇది దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తనకు కూడా పెళ్లయింది. ఈ ఇద్దరూ విడి పోయారు. నిడుమూరు భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సమంత గురించి. కానీ వీరు పట్టించుకోలేదు. రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ బహిరంగంగా తిరుగుతున్నారు. ఇప్పుడు సొసైటీలో సహజీవనం ఓ స్టేటస్ సింబల్ గా మారి పోయింది. తాజాగా తను నటించిన మా ఇంటి బంగారం శుక్రవారం నుంచి విడుదల కానుంది ప్రపంచచ వ్యాప్తంగా. ఈ సందర్బంగా సమంత సినిమా గురించి ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకుంది.
ఇప్పటి వరకు తన సినీ కెరీర్ లో కొన్ని సినిమాల పట్ల తాను సంతోషంగా లేనని బాంబు పేల్చింది. కొన్ని అనుకోకుండా నటించానని తెలిపింది. ఈ సినీ ప్రయాణం ఆశించినంతగా లేదంటూ ఒప్పుకుంది. ఇదే క్రమంలో ప్రజాదరణ తనపై బలమైన ప్రభావాన్ని చూపాయని అంగీకరించారు. తన నటన ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానికంటే కీర్తి, మీడియాలో లభించే ప్రచారం తో పాటు ఎన్ని సినిమాలకు సంతకం చేస్తున్నాననే అంశాలకే ఒకానొక సమయంలో తాను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని ఒప్పుకున్నారు.
అభిమానుల నుండి లభించిన అద్భుతమైన స్పందనతో పాటు తన ప్రజాదరణలో వచ్చిన వేగవంతమైన పెరుగుదల తనకు ఆశ్చర్యం కలిగించాయని సమంత రుత్ ప్రభుపేర్కొన్నారు. గతంలో చేసిన కొన్ని సినిమాల విషయంలో తాను వేరే విధానాన్ని అనుసరించి ఉండాల్సిందని అన్నారు. అలాగే కాలక్రమేణా ఒక నటిగా తాను గణనీయంగా ఎదిగానని ఆమె నమ్ముతున్నారు. అనేక విజయవంతమైన చిత్రాలలో భాగమైనప్పటికీ, ఒక ప్రాజెక్ట్‌కు తాను ఎలాంటి విలువను జోడిస్తున్నాననే విషయంపై ఎప్పుడూ లోతుగా ఆలోచించలేదని సమంత తెలిపారు.
