తెలంగాణ‌కు మంగ‌ళం ఏపీకి అంద‌లం

కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం

హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న కేంద్ర స‌ర్కార్ పై, పీఎం మోదీతో పాటు కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి జి. కిష‌న్ రెడ్డిని ఏకి పారేశారు. సీఎం మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ చెప్పుడు మాట‌లు విని మెట్రో రెండో విస్త‌ర‌ణ‌కు కేంద్రం అడ్డుపుల్ల వేస్తోంద‌ని, ప్ర‌త్యేకించి దీనికి ప్ర‌ధాన అడ్డంకిగా కిష‌ణ్ రెడ్డి ఉన్నాడ‌ని మండిప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పైసా కూడా ఇవ్వ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. తెలంగాణ ప‌ట్ల కేంద్రం వివ‌క్ష చూపిస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జూబ్లీ హిల్స్, మాదాపూర్ అంత చిన్నదైన విశాఖపట్నానికి కూడా మెట్రో వస్తోందని మ‌రి ప్ర‌పంచంలోనే టాప్ సిటీగా పేరు పొందిన హైద‌రాబాద్ కు ఎందుకు అనుమ‌తి ఇవ్వ‌డం లేదంటూ నిల‌దీశారు.

కేంద్రం నుండి హైదరాబాద్ ఫేజ్ 2 మెట్రోకు అనుమతి లభించలేదని ముఖ్యమంత్రి దాదాపుగా విలపించారు. కేంద్రం నుండి మెట్రో అనుమతులు పొందిన ప్రతి నగరం/రాష్ట్రం పేరును ఆయన ప్రస్తావించారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో, ఆయనకు బీజేపీ పట్ల ఉన్న ప్రేమను, ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న అమితాసక్తిని అందరూ ప్రశ్నించినప్పుడు, తెలంగాణకు కేంద్రం నుండి పూర్తి మద్దతు లభించేందుకే తాను మంచి సంబంధాలు కొనసాగిస్తున్నానని ఆయన అన్నారు.

ఇప్పటి వరకు! ‘ఢిల్లీలో అత్యధిక పర్యటనలు చేసిన ముఖ్యమంత్రి’ రికార్డు బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిటే ఉంది. యన డెబ్బై ఒక్కసార్లు పర్యటించారు, ప్రతిసారీ ప్రధాని మోదీని ఆలింగనం చేసుకుంటూ కనిపించారు. రోజు చివరిలో, ‘విశాఖపట్నం’కు దక్కాల్సింది హైదరాబాద్‌కు దక్కలేదంటూ పేర్కొన‌డం , ఆరోప‌ణ‌లు చేయ‌డం విస్తు పోయేలా చేసింది. బీజేపీ వ్యతిరేకి అనే ఇమేజ్‌ను ప్రదర్శించే ప్రయత్నంలో సీఎం మ‌రో గేమ్ కు తెర తీశాడ‌ని బీఆర్ఎస్ నేత‌లు ఆరోపిస్తున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!