హైదరాబాద్ : ఎందరో బలిదానాలు, ఆత్మ త్యాగాల ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీన్ మారింది. పూర్తిగా ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టేలా, దెబ్బ తినేలా వ్యవహరిస్తూ వస్తున్నారు. పేరుకే సీఎం రేవంత్ అయినా పాలన అంతా సీఎం చంద్రబాబు నాయుడు కనుసన్నలలో కొనసాగుతోంది. ప్రధానంగా విద్యుత్ రంగ సంస్థలో తెలంగాణ ప్రాంతానికి చెందిన అనుభవం కలిగిన అధికారులు ఉన్నా వారిని పక్కన పెట్టి ఆంధ్రాకు చెందిన వారిని నియమించడం కలకలం రేపుతోంది. టీజీఎస్పీడీసీఎల్ లో డైరెక్టర్ ఆపరేషన్స్ పోస్టులో ఉన్న వ్యక్తి ఏపీకి చెందిన వారు. పని ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో ఏనాడూ పనిచేయని అధికారి. తెలంగాణ రాష్ట్రంలో డైరెక్టర్ గా నియామకం కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తెలంగాణ రాష్ట్ర భౌగోళికం, ప్రజల జీవన విధానం తెలియదు.
ఇక రాష్ట్ర ముఖ్య విద్యుత్తు తనిఖీ అధికారి పుట్టింది ఏపీలో,. తన సర్వీసు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే, తెలంగాణ రాష్ట్ర ముఖ్య విద్యుత్తు తనిఖీ అధికారిగా నియమించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏనాడూ పనిచేయని అధికారి. తెలంగాణ యాస బాస తెలియని వ్యక్తి. జెన్ కోలో డైరెక్టర్ గా ఉన్న అధికారి పుట్టింది ఏపీలో. తెలంగాణ రాష్ట్ర జెన్కో డైరెక్టర్ గా నియమించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వీరి ఆధీనంలో పని చేస్తుంది. కమర్షియల్ ఫైనాన్స్ డైరెక్టర్ గా నియమించిన అధికారి సైతం ఏపీదే. పూర్తి సర్వీసు తెలంగాణేతర ప్రాంతం, తెలంగాణ జెన్కో డైరెక్టర్ గా నియమితులు అయ్యారు. ఇక జెన్కో సివిల్ డైరెక్టర్ నియామకం పూర్తిగా విచిత్రంగా ఉంది. ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొన్న డైరెక్టర్ పోస్టుల్లో ఈ డైరెక్టర్ పోస్టు లేదు. తను ఛీఫ్ ఇంజనీర్ గా పని చేసే సమయంలో, ఇంధన శాఖ కార్యదర్శి గా ఒక ఐఏఎస్ అధికారి నియామకం కాగానే, వెంటనే రిజైన్ చేశారు. ఆ తరువాత ఆ ఐఏఎస్ అధికారిని బదిలీ చేశారు. ఆ వెంటనే వీరు డైరెక్టర్ సివిల్ గా నియామకం జరిగింది. ఆ తరువాత, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఐదుగురు డైరెక్టర్లు చట్టబద్ధంగా నియామకాలు జరిపారు. కానీ వీరు మాత్రం లేని పోస్టులో ఇప్పటి వరకు కొనసాగుతున్నారు.
నిన్న గాక మొన్ననే సదరం డిస్కం బోయినపల్లి డివిజనల్ ఇంజనీరు ప్రకారం ఫోకల్ (ప్రాముఖ్యత) పోస్టు లో, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికారిని నియమించారు. ప్రమోషన్ల ద్వారా నియమించాలని బావించి నప్పటికీ, ప్రమోషన్లు ప్రక్కన పెట్టి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికారికి బదిలీపై ఫోకల్ ప్లేస్ ఇచ్చారు. గతంలో తను ఎసిబి కేసులో సస్పెన్షన్ అయ్యారు. ఎసిబి కేసుల విషయం ప్రక్కన పెట్టి ఫోకల్ పోస్టింగ్ ఇవ్వడం, అందునా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికారికి, ట్రాన్స్ ఫర్ గైడ్ లైన్స్ ను ప్రక్కన పెట్టి ఇవ్వడం ద్వారా విద్యుత్తు శాఖలో కొంత అయోమయం నెలకొంది.
