నన్ను కాల్చి చంపినా ప్ర‌జ‌ల కోసం రాజీ ప‌డ‌ను

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్‌

హైదరాబాద్ : బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇదే స‌మ‌యంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టు గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఏకే – 47 తీసుకొచ్చి కణత మీద పెట్టినా ఈటల రాజేందర్ రాజీ పడడు అని ప్ర‌క‌టించారు. ధర్మం కోసం, ప్రజల కోసం నన్ను కాల్చి చంపుతామన్నా రాజీ పడనని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. మేడిగడ్డలో నీళ్ళు నిలపకుండానే నీళ్లను ఎత్తిపోయవచ్చు రేవంత్‌ రెడ్డి అంటూ ఫైర్‌ అయ్యారు. వచ్చే ఎల్‌నినో ను దృష్టిలో పెట్టుకుని రైతులు, ప్రజల క్షేమం కోసం భేష‌జాల‌ను పక్కన పెట్టి మంత్రి ఉత్తం కుమార్‌రెడ్డి ఉత్తమంగా ఆలోచించాలని సూచించారు.

తాను తెలంగాణ మట్టిబిడ్డను, ఉద్యమకారున్ని, అదే నా గుర్తింపు అంటూ ఈటల మండిపడ్డారు. రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను.. చీల్చి చెందాడుతానని హెచ్చ‌రించారు. తాము స్వయం ప్రకాశితులం, ఎవరో మాట్లాడిస్తేనో.. స్క్రిప్ట్ రాసి ఇస్తేనో.. ఎవరి మెప్పుకోసమే మాట్లాడే వాళ్ళం కాదన్నారు. అలా ఆరోపించే నీచులకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రైతులను ఇబ్బంది పెడితే ఖబర్ధార్ అని వార్నింగ్ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీని, ఇంకో పార్టీని తిట్టడానికి రాలేదన్నారు. పని చేయాల్సిన వారిని అడుగుతున్న. దేవాదులకు బెరాజ్ లేదు, లేకుండా నీళ్ళు పంపు చేస్తున్నారని వాపోయారు. హైదరాబాద్ కి ఇప్పుడే 107 ఎంజీడీ నీళ్లు సరఫరా తక్కువ ఉంది. నీటి కొరత వస్తే ఎటు పోవాలి అని ప్ర‌శ్నించారు.

Leave A Reply

Your Email Id will not be published!