బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికిన ఆల‌య క‌మిటీ స్వాగ‌తం

సికింద్రాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. ఉత్సవాల‌లో ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కొండా సురేఖ‌, పొన్నం ప్రభాక‌ర్, దిన‌స‌రి సీత‌క్క పాల్గొన్నారు. సికింద్రాబాద్ లోని మ‌హంకాళి అమ్మ వారికి పూజ‌లు చేశారు. తాజాగా సచివాలయంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు. సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బోనాల పండుగ అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సచివాలయ ప్రాంగణంలోని శ్రీ నల్ల పోచమ్మ ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభాగ్యం మరియు ఆరోగ్యం కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు అమ్మ వారికి భక్తి పూర్వకంగా సంప్రదాయ బోనాన్ని సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల ఊరేగింపులు , రంగు రంగుల సంప్రదాయ దుస్తులు ధరించిన కళాకారుల ప్రదర్శనలు ఈ వేడుకలకు ప్రత్యేక శోభను చేకూర్చాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, అధికారులు ఈ వేడుకల్లో పాల్గొని అమ్మ వారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు సంజయ్ జాజు. మహంకాళి అమ్మ వారి ఆశీస్సులతో తెలంగాణలో శాంతి, సౌభాగ్యం, సంతోషం మరియు నిరంతర అభివృద్ధి నెలకొనాలని ఆకాంక్షించారు.ఇదిలా ఉండ‌గా ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ప్ర‌భుత్వం ముంద‌స్తుగా నిధులు మంజూరు చేసింది.

Leave A Reply

Your Email Id will not be published!