అమెరికాలో 2,000 స్క్రీన్‌లలో య‌ష్ ‘టాక్సిక్’ రిలీజ్

విడుద‌లైన ట్రైల‌ర్ కు ఊహించ‌ని స్పంద‌న

బెంగ‌ళూరు :గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఇండియ‌న్ స్టార్ హీరో య‌ష్ కీ రోల్ పోషించిన టాక్సిక్ అంచ‌నాల‌కు మించి ఆద‌ర‌ణ చూర‌గొంటోంది. బెంగ‌ళూరు వేదిక‌గా అధికారికంగా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఇప్ప‌టికే మిలియ‌న్స్ వ్యూస్ తో దూసుకు పోతోంది. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తీశారు ద‌ర్శ‌కురాలు. తాజాగా టాక్సిక్ కు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చేసింది. యష్ నటించిన అత్యంత ఆసక్తికరమైన చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ అమెరికాలో భారీ స్థాయిలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం 2,000కు పైగా స్క్రీన్‌లలో ప్రదర్శితం కానుండగా, అమెరికన్ మార్కెట్‌లో అత్యధిక స్క్రీన్‌లలో విడుదలవుతున్న భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలవనుంది.

టాక్సిక్ మూవీ ఆగస్టు 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ఆంగ్లంతో సహా పలు భాషల్లో విడుదల కానుండటం వల్ల అంతర్జాతీయ ప్రేక్షకులకు మరింత చేరువ కానుంది. ఈ చిత్రంలో యష్ ప్రధాన పాత్రలో నటించగా కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా , రుక్మిణి వసంత్ వంటి ప్రముఖ తారలు కీలక పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం సమకూర్చారు. యష్ అభిమానులలో ఈ సినిమా ప్రచార చిత్రాలు భారీ ఆసక్తిని రేకెత్తించడంతో ‘టాక్సిక్’ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి; దీనికి అనుగుణంగానే అమెరికాలో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు మ‌రో వైపు పాట‌లు, ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇప్ప‌టికే య‌ష్ కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాక్సిక్ కు త‌ను నిర్మాత‌, న‌టుడు, స‌హ ర‌చ‌యిత కూడా. దీంతో అంచ‌నాలు మ‌రింత పెరిగేలా చేశాయి. .

Leave A Reply

Your Email Id will not be published!