నీటి లభ్యతకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి : సీఎం
ఎల్ నినో ప్రభావం వ్యవసాయ రంగంపై అత్యధికంగా ఉంటుంది
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు నీటి పారుదల రంగం గురించి. కాటన్ బ్యారేజీకి 2,557 టీఎంసీల నీటికి గానూ 1,071 టీఎంసీల జలాలు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. గోదావరి బేసిన్‌లో కూడా వర్షపాతం తక్కువగా నమోదవుతుందని పేర్కొన్నారు. కృష్ణాతో పోల్చుకుంటే గోదావరి బేసిన్‌లో కొంత మేర నీటి లభ్యత ఎక్కువ ఉంటుందన్నారు. దీని కారణంగా గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించామని తెలిపారు సీఎం. గడచిన రెండేళ్లల్లో సమర్ధంగా నీటి నిర్వహణ చేపట్టడం జరిగిందన్నారు. సుమారు 552 టీఎంసీల నీరు పొదుపు చేసుకోగలిగాం.. ఇదే శ్రీరామరక్షగా ఉందన్నారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందన్నారు. కృష్ణా, పెన్నా బేసిన్‌లలో నీటి లభ్యత తక్కువగా ఉంటుందని, గోదావరిలో కొంత మేర బాగానే ఉన్నా ఇక్కడ కూడా సరైన నీటి నిర్వహణ చేపట్టాలన్నారు నారా చంద్రబాబు నాయుడు.
.ఎల్ నినో ప్రభావం వ్యవసాయంపై బాగా పడుతుందన్నారు. . ఇబ్బంది పడే సూచనలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రధాన రిజర్వాయర్లల్లో 586 టీఎంసీల నీళ్లు ఉన్నాయని, భూగర్భజల మట్టాలు కూడా తగ్గుతున్నాయని వాపోయారు. పరిస్థితిని ముందే అంచనా వేసుకుని కార్యాచరణ చేపట్టామని తెలిపారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్దం చేశామని, పరిశ్రమలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గోదావరి తప్ప ఎక్కడ పంటలు వేసినా ఇబ్బందులు తప్పవు. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి.. సహకరించాలని కోరారు సీఎం. క్షేత్రస్థాయిలో పొదుపు నీటిని వాడుకోకుంటే కష్టాలు వస్తాయని హెచ్చరించారు. సమర్థ నీటి నిర్వహణ కోసం ఎన్ ఫోర్సుమెంట్ కమిటీలు వేశాం. ప్రజా ప్రతినిధులు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలను సిద్ధం చేయాలన్నారు.
