హైదరాబాద్ : నేషనల్ క్రష్, పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న ఇప్పుడు మరోసారి సంచలనంగా మారారు . తను ప్రముఖ దివంగత గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కించే బయో పిక్ లో కీలకమైన పాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా కూడా ప్రకటించారు. దీంతో రష్మిక మందన్న ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతోందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది అభిమానులలో. తను ఇటీవలే విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం కంటిన్యూగా సినిమాలు చేస్తోంది. ఈ ఇద్దరూ కలిసి రణబాలి మూవీలో పని చేస్తున్నారు. చాలా కాలం గ్యాప్ తర్వాత. ఈ ఇద్దరూ పరుశురామ్ దర్శకత్వం వహించిన గీత గోవిందంలో నటించారు..మనసు దోచుకున్నారు.
ఇక రాబోయే బయోపిక్‌లో ప్రముఖ కర్ణాటక గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్ట్, ముఖ్యంగా ఆ ఐకానిక్ గాయనిగా రష్మిక రూపాంతరంపై ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించింది. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కంచివరం చీరలు, ఆభరణాలు , మల్లెపూలతో అలంకరించిన ఆమె ప్రత్యేకమైన కేశాలంకరణతో కూడిన సొగసైన సాంప్రదాయ రూపానికి ప్రసిద్ధి చెందారు. ఈ చిత్రం కోసం చిత్ర నిర్మాతలు ఈ క్లాసిక్ లుక్‌ను పునః సృష్టించనున్నారని భావిస్తున్నారు.
ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను చెన్నైలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. ఈ పాత్ర కోసం రష్మిక లుక్‌ను కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన రూపొందిస్తున్నారు. ఈ బయోపిక్‌కు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి అధికారికంగా ‘ఎం.ఎస్. – ఎ లెగసీ ఆన్ స్క్రీన్’ అని పేరు పెట్టారు.
