విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నకు విజ‌య్ కంగ్రాట్స్

అక్టోబ‌ర్ 16న ప్ర‌పంచ వ్యాప్తంగా ర‌ణ‌బాలి విడుద‌ల

చెన్నై : యంగ్ యాక్ట‌ర్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న మ‌ర్యాద పూర్వ‌కంగా చెన్నైలోని సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ నివాసంలో క‌లిశారు. ఈ సంద‌ర్బంగా ఈ కొత్త జంట‌ను అభినందించారు. ఈ ఇద్ద‌రూ గ‌తంలో గీత గోవిందం మూవీలో క‌లిసి న‌టించారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డ్డారు. ఆ త‌ర్వాత కొన్నేళ్ల పాటు డేటింగ్ లో ఉన్నారు. చివ‌ర‌కు ఈ ఇద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు. ఘ‌నంగా పెళ్లి చేసుకున్నారు. చాన్నాళ్ల గ్యాప్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి తాజాగా రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ర‌ణ‌బాలి మూవీలో న‌టించారు. ఈ సినిమా ర‌జ‌నీకాంత్ న‌టించిన జైల‌ర్ -2 మూవీ అక్టోబ‌ర్ 15న రిలీజ్ కానుండ‌గా రౌడీ , ర‌ష్మిక మంద‌న్నా మూవీ 16న రానుంది. మ‌రో వైపు కోలీవుడ్ లో అత్యంత సింప్లిసిటీకి పేరు పొందిన న‌టుడిగా గుర్తింపు పొందారు ద‌ళ‌ప‌తి విజ‌య్.

ఆయ‌న గ‌త రెండేళ్ల కింద‌ట టీవీకే పార్టీని ఏర్పాటు చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో సుదీర్ఘ‌మైన రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల‌ను కాద‌ని భారీ మెజారిటీని సాధించారు తాజాగా రాష్ట్రంలో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో. సీపీఐ, సీపీఎం, వీసీకే , కాంగ్రెస్ పార్టీల‌తో క‌లిసి టీవీకే కూట‌మి స‌ర్కార్ ను ఏర్పాటు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు సీఎం విజ‌య్. ఈ నేప‌థ్యంలో ఆయ‌న అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేలా సంక్షేమ కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాల‌ను తీసుకు వ‌చ్చారు. త‌న‌ను క‌లిసిన కొత్త సినీ జంట విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌ల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్.

Leave A Reply

Your Email Id will not be published!