అమరావతి : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొణిదలతో తాను విడి పోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు తన భార్య, రష్యాకు చెందిన అన్నా కొణిదల. 13 ఏళ్ల వివాహ బంధం తర్వాత విడిపోతున్నట్లు ప్రకటించడం కలకలం రేపింది. ఈ దంపతులు విడిపోవాలని నిర్ణయించు కున్నారనే సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విడి పోవడంపై పవన్ కళ్యాణ్ లేదా అన్నా కొణిదల నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్త ఎంతవరకు నిజమో ఇంకా స్పష్టం కాలేదు. తమ వివాహ బంధం ముగిసినప్పటికీ తాము మంచి స్నేహితులుగానే ఉంటామని పవన్ కళ్యాణ్ ,అన్నా పేర్కొన్నారు. తమ పిల్లల సంతోషం, సంక్షేమమే తమకు అత్యంత ముఖ్యమని వారు తెలిపారు.
తమ వ్యక్తిగత జీవితంలోని ఈ దశలో, తమ గోప్యతను గౌరవించాలని వారు అభిమానులను, ప్రజలను కోరారు. అలాగే గత కొన్నేళ్లుగా తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్, రష్యాకు చెందిన అన్నా లెజ్నెవాను 2013 సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అన్నాను వివాహం చేసుకోక ముందు పవన్ కళ్యాణ్ నటి రేణు దేశాయ్‌ని వివాహం చేసుకున్నారు. వీరి వివాహం 2009లో జరగగా, 2012లో విడాకులు తీసుకున్నారు. అంతకు ముందు 1997లో ఆయన నందినిని వివాహం చేసుకోగా 2008లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.
ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుండటంతో పవన్ కళ్యాణ్ లేదా అన్నా కొణిదల నుండి అధికారిక స్పష్టత కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.