Modi : ఓ వైపు ప్రతిపక్షాలు మోదీజీ నాయకత్వంపై కారాలు మిరియాలు నూరుతుంటే మరో వైపు ఆయనకు మాత్రం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటున్నారని, దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుంటు పడుతోందని, కార్పొరేట్ శక్తులకు వంత పాడుతూ దేశాన్ని తిరోగమనం వైపునకు తీసుకు వెళుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. దీనిని పటా పంచలు చేస్తూ భారతీయ ప్రధానమంత్రిగా తనను తాను సక్సెస్ ఫుల్ లీడర్ గా ప్రూవ్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇతర దేశాలు సైతం ఇబ్బందులకు లోనవుతుంటే ఇండియా మాత్రం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో సఫలీకృతమైంది. ఎప్పుడైతే వ్యాధి లక్షణాలు బయటకు వచ్చాయో అప్పుడే మోదీజీ అలర్ట్ అయ్యారు.
ఆర్థికంగా నష్ట పోయినా సరే, అన్ని వ్యవస్థలు కుప్ప కూలినా సరే ప్రధాన ప్రయారిటీ మాత్రం ప్రజల ఆరోగ్యానికేనని స్పష్టం చేశారు. ఆ మేరకు దేశ వ్యాప్తంగా షరతులతో కూడిన లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ప్రపంచం విస్తు పోయింది. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కొన్ని దేశాలు లైట్ గా తీసుకున్నాయి. కానీ రాను రాను వ్యాధి లక్షలాది మందిని కబళిస్తూ పోతూ వుంటే బెంబేలెత్తి పోయారు. ఆయా దేశాల అధినేతలు ఇండియా అనుసరించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలకు తలొంచక తప్పలేదు. అంతెందుకు వరల్డ్ ను ఒంటి చేత్తో శాసిస్తున్న అమెరికా కరోనా కట్టడి లో పూర్తిగా ఫెయిల్ అయ్యింది. మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ సైతం దీనిని ఎదుర్కోలేక పోయారు.
తేలికగా తీసుకుని అమెరికన్ల ఆగ్రహానికి గురయ్యారు. చివరకు తాజాగా జరిగిన ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో కోలుకోలేని రీతిలో ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆయనకు పదవీ గండాన్ని కలిగించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో డెమోక్రటిక్ పార్టీకి చెందిన బైడన్ కు అధికారాన్ని బదలాయించేందుకు అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఓ వైపు రష్యాను కూడా తక్కువ అంచనా వేశారు. కానీ ఆ దేశాధ్యక్షుడు ముందుగానే తేరుకున్నారు. నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఇక ఇండియా మాత్రం అత్యంత మెరుగైన నిర్ణయాలు తీసుకుని ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడింది.
ఈ విషయంలో మోదీజీ పాలనా పరంగా విఫలమయ్యారన్న విపక్షాల విమర్శలను పక్కన పెడితే ..కరోనా కంట్రోల్ లో మాత్రం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ప్రతి ఏటా ప్రపంచంలోని వివిధ దేశాలు..అధినేతల పనితీరుపై మార్నింగ్ కన్సల్ట్ సంస్థ సర్వే చేపడుతుంది. ఈసారి ఇండియన్ ప్రైమ్ మినిష్టర్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీజీకి ఇండియన్లు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా సంస్థ ఒపినియన్ పోల్ లో 55 శాతం ప్రజలు ఆయన నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే విషయాన్ని సంస్థ ప్రకటించింది. ఇక ఇతర దేశాల వరకు చూస్తే జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలాకు 24 శాతం రాగా బ్రిటన్ ప్రధానమంత్రి పరిస్థితి ఏమీ బాగోలేదంటూ స్పష్టం చేశారు. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా మన ఛాయ్ వాలా మరోసారి తన నాయకత్వాన్ని నిరూపించుకున్నారు.

No comment allowed please