ప్రధాని ఆస్తుల విలువ..రూ.2.85 కోట్లు మాత్రమే..
సొంత కారు కూడా లేదు..882 గజాల నివాస స్థలం విలువ రూ.1.10కోట్లు
ప్రస్తుత కాలంలో రాజకీయాల్లోకి వచ్చే90 శాతం నాయకులు..కేవలం డబ్బులు సంపాదించడానికి లేదా కాంట్రాక్టులు, టెండర్లు సంపాదించడానికి అన్నట్టు వస్తుంటారు. కానీ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం నిఖార్సయిన రాజకీయ నాయకుడిలా..ప్రజలను పరిపాలించాల్సిన వారు ఎలా ఉండాలో నిరూపిస్తున్నారు. ఆయన తన ఆస్తుల వివరాలను ప్రధానమంత్రి కార్యాలయానికి అందించారు. అందులో ఆయన ఆస్తుల విలువ ప్రస్తుత కాలానికి చూస్తే రూ 2.85 కోట్లుగా ఉంది. గాంధీనగర్ లోని ఎస్ బీఐ శాఖలో ఆయనకు జాతీయ పొదుపు ధృవీకరణ పత్రాలు (ఎన్ఎస్ఎస్ బాండ్లు), జీవిత బీమా పాలసీలు, రూ.20వేలకు ఇన్ ఫ్రా బాండ్ లు ఉన్నాయి..వాటి విలువ రూ.1.60 కోట్లుగా ఉంది.
ప్రస్తుతం ఆయన ఖాతాలో నగదు కేవలం రూ 31,450 మాత్రమే..ఆయనకు సొంత కారు కూడా లేదు. ఇంతవరకు తన పేరు మీద కారు కొన్నట్టు రిజిస్టర్ అయి లేకపోవడం విశేషం. మోదీ వద్ద పెద్ద బంగారు ఉంగరాలు 4 ఉన్నాయి..ఒకొక్కటి 45 గ్రాములు ఉంటుంది. ప్రస్తుత ధర ప్రకారం చూస్తే వాటి విలువ మొత్తం రూ.10లక్షలుగా చెప్పవచ్చు. గాంధీనగర్ లోని సెక్టార్-1లో 3,531 చదరపు గజాల స్థలం ఉంది. అది నలుగురు మిత్రులు కలిసి తీసుకున్నారు. అందులో ఆయన వాటా 25శాతంగా ఉంది. అంటే 882 గజాలు ఆయనకు వస్తుంది. ప్రస్తుతం దాని విలువ రూ.1.10కోట్లుగా ఉంది.
ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి గా ఆయనకు నెలకు రూ.2 లక్షల జీతం వస్తుంది..అదే ఆయన ఆదాయవనరుగా ఉంది. వాటినే ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయడం, మళ్లీ వాటి మీద వడ్డీని డిపాజిట్ చేయడం..ఇలా చేస్తుంటారని అంటున్నారు. ఇదండీ సంగతి..మన దేశ ప్రధాని ఆస్తి..నాయకుడు పదిమందికి స్ఫూర్తిమంతంగా ఉండాలంటారు. అందుకు నిలువెత్తు నిదర్శనం మన దేశ ప్రధాని కావడం మనందరికి గర్వకారణం.
