Yuzvendra Chahal : ఐపీఎల్ 2022లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు ఆటగాళ్లు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ తరుణంలో ఒకప్పుడు ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న యుజువేంద్ర చహల్(Yuzvendra Chahal )సంచలన కామెంట్స్ చేశారు.
2013లో జరిగిన సంఘటన గురించి ఇవాళ గుర్తు చేసుకున్నాడు. తాను ఆనాడు ముంబై కి ఆడుతున్నానని తెలిపాడు. ఆ జట్టులో తాగిన ఓ ఆటగాడు తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని వాపోయాడు.
కానీ ఆ ఆటగాడు ఎవరనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు చహల్. తాగి వచ్చిన సదరు ప్లేయర్ తనను బాల్కానీలో వేలాడ దీశాడని చెప్పాడు. బతికి బయట పడ్డానని తెలిపాడు.
ఈ విషయాన్ని తన సహచరులు రవిచంద్రన్ అశ్విన్, కరుణ్ నాయర్ తో పంచుకున్నాడు. వారితో తనకు జరిగిన బాధాకరమైన సన్నివేశాన్ని పంచుకున్నాడు చహల్(Yuzvendra Chahal ). ఫుల్ గా తాగిన సదరు ప్లేయర్ నన్ను బాల్కానీ నుంచి వేలాడ దీశాడంటూ బాంబు పేల్చాడు.
రాజస్థాన్ తరపున చహల్ అద్బుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ లలో 7 వికెట్లు తీశాడు. ఆనాడు జరిగిన ఘటన తనను ఇంకా బాధ పెడుతోందంటూ వాపోయాడు చహల్.
నా కథ కొందరికి మాత్రమే తెలుసు. దీని గురించి తాను ఎప్పుడూ చెప్పలేదన్నాడు. ఈ ఘటన 2013లో జరిగింది. బెంగళూరులో ఆ మ్యాచ్ జరిగింది. అనంతరం గెట్ టు గెదర్ లో ఓ ఆటగాడు తాగి వచ్చాడు.
నన్ను చూస్తు రమ్మన్నాడు. వెళ్లగానే బాల్కానీ నుంచి వేలాడ దీశాడంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. నా చేతులు అతడి చుట్టూ ఉన్నాయి. నేను 15వ అంతస్తులో ఉన్నా. చాలా మంది అక్కడికి వచ్చి పరిస్థితిని కూల్ చేశారని చెప్పాడు చహల్.
Also Read : షా షాన్ దార్ లక్నో సూపర్