Azam Khan : ఖాకీల తీరుపై ఆజం ఖాన్ కన్నెర్ర
నేను నేరస్తుడినే అయితే ఏంటి
Azam Khan : ఉత్తర్ ప్రదేశ్ లో ఆటవిక రాజ్యం నడుస్తోంది. ఇలాంటి పాలన ఇంకెక్కడా అమలు కావడం లేదు. పోలీసులు పూర్తిగా రెచ్చి పోతున్నారు. వాళ్లు బీజేపీ తప్ప ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు సమాజ్ వాది పార్టీ నేత ఆజం ఖాన్(Azam Khan).
నేను నేరస్థుడినంటూ వాళ్లు భావిస్తున్నారు. అలాగే ట్రీట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా గురువారం యూపీ లోని ఆజంగఢ్ , రాంపూర్ పార్లమెంట్ స్థానాలకు లోక్ సభ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ తరుణంలో పోలీసులు విధ్వంసం సృష్టించారంటూ ఆజం ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంపూర్ లో ఎస్పీ లోక్ సభ అభ్యర్థితో పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ఆరోపించారు.
నేను రాత్రంతా మేల్కొని ఉన్నా. మా లోక్ సభ అభ్యర్థి గంజ్ పోలీస్ స్టేషన్ , కొత్వాలి పోలీస్ స్టేషన్ , సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ వెళ్లారు. గంజ్
పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఆజం ఖాన్(Azam Khan).
అతను పూర్తిగా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతడే కాదు మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా అలాగే ఉందన్నాడు ఆజం ఖాన్. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని ప్రశ్నించారు.
కొందరిని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను నేరస్థుడినని ఒప్పుకుంటున్నాను. వారు ఏది కావాలంటే అది చేయగలరు.
ఎందుకంటే పవర్ మా చేతిలో లేదు. భరించక తప్పదన్నారు పలు కేసులను ఫేస్ చేస్తున్న ఆజం ఖాన్.
ఇదిలా ఉండగా ఈ ఏడాది ప్రాంరభంలో జరిగిన ఎన్నికల్లో యూపీ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ రాజీనామా
చేయడంతో ఆజంగఢ్ ఉప ఎన్నిక అనివార్యమైంది.
అదే విధంగా ఆజం ఖాన్ కూడా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కావడంతో రాంపూర్ లోక్ సభ ఉప ఎన్నిక జరుగుతోంది.
Also Read : ప్రభుత్వాలను కూల్చే వాళ్లకు వరదలు పట్టవు