BR Ambedkar Quotes : అంబేద్కర్ ఆలోచనలు స్పూర్తి కిరణాలు
మన కాలంలో అరుదైన మానవుడు
BR Ambedkar Quotes : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14. ఇవాళ యావత్ ప్రపంచం ఆయనను స్మరించుకుంటోంది. ఇంతకూ అంబేద్కర్ ఏం చెప్పాడు. ఆయన ఆలోచనలు , మాటలు నేటికీ ఆచరణాత్మకంగా ఉన్నాయి. మహనీయుడు చెప్పిన వాటిలో కొన్ని మీ కోసం.
ఈ దేశంలో అత్యత దూరదృష్టి కలిగిన నాయకులలో అంబేద్కర్(BR Ambedkar Quotes) ఒకరు. దేశానికి తొలి న్యాయ శాఖ మంత్రి. ఆయన సూక్తులు కోట్లాది మందిని ఉత్సాహ పరుస్తున్నాయి. ఆలోచింప చేస్తున్నాయి. నేను హిందూ మతంలో పుట్టాను. కానీ హిందువుగా చని పోదల్చుకోలేదంటూ సంచలన ప్రకటన చేశాడు అంబేద్కర్. మన వ్యక్తిత్వంలో ఆత్మ విశ్వాసం వెళ్లి విరియాలి. అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే శక్తిని ప్రసాదించాలన్నాడు.
మహిళలు సాధించిన ప్రగతి స్థాయిని బట్టి నేను సంఘం పురోగతిని కొలుస్తాను. మీరు సామాజిక స్వేచ్ఛను సాధించినంత కాలం చట్టం ద్వారా ఏ స్వేచ్ఛను అందించినా మీకు ప్రయోజనం ఉండదు. స్వేచ్ఛ , సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని బోధించే మతం అంటే నాకు చాలా ఇష్టం .
విద్యావంతులుగా ఉండండి. వ్యవస్థీకృతంగా ఉండండి. ఆందోళన మాత్రం చెందకండి. మనసు స్వేచ్ఛే నిజమైన స్వాతంత్రం. ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకిక వాద సూత్రాలను పొందు పరిచే రాజ్యాంగాన్ని కలిగి ఉన్నందుకు నా దేశం గురించి నేను గర్విస్తున్నానని పేర్కొన్నాడు అంబేద్కర్.
ఎవరి జీవితమైనా సరే సుదీర్ఘంగా కాకుండా గొప్పగా ఉండాలి. మన మతం నుండి , మన సంస్కృతి నుండి ఏదా మన భాష నుండి వచ్చిన విధేయత ఏదైనా పోటీ విధేయత వల్ల భారతీయులుగా మన విధేయత స్వల్పంగానైనా ప్రభావితం కాకుడదని నేను కోరుకోవడం లేదన్నాడు.
బుద్దుని బోధనలు శాశ్వతమైనవి. కానీ అప్పుడు కూడా బుద్దుడు వాటిని తప్పు పట్టలేనివిగా ప్రకటించ లేదు. మీరు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే బౌద్ద మతం హేతువుపై ఆధారపడి ఉందని మీరు చూస్తారు. మీరే ఇతర మతం లోనూ లేని సౌలభ్యం ఇందులో అంతర్లీనం గా ఉంది.
ఒక గొప్ప వ్యక్తి సమాజానికి సేవకుడిగా ఉండేందుకు సిద్దంగా ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి కంటే భిన్నంగా ఉంటాడు. ఒక మొక్కకు నీరు ఎంత అవసరమో ఆలోచనకు ప్రచారం కూడా అంతే అవసరమని స్పష్టం చేశాడు భీమ్ రావ్ అంబేద్కర్.
Also Read : పాల వ్యాపారం రాజకీయ దుమారం