అమిత్ షాతో ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ భేటీ

కీల‌క అంశాల‌పై సుదీర్ఘ‌మైన చ‌ర్చ‌లు జ‌రిపారు

చెన్నై : త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ఈ సందర్భంగా కొత్త‌గా కొలువు తీరిన సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ భేటీ అయ్యారు. ఈ ఇద్ద‌రి భేటీ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. చెన్నైలోని చెంగల్పట్టులో తొలిసారిగా స‌మావేశం అయ్యారు. దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం చెన్నైకి వచ్చిన హోం మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి విజయ్ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం విజయ్ పాల్గొంటున్న తొలి సమావేశం ఇదే కావ‌డం విశేషం. దక్షిణ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం జ‌రుగుతోంది. ప్ర‌ధానంగా రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న వివాదాలపై చర్చకు రానుంది.

అంత‌కు ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కట్టుదిట్టమైన భద్రత నడుమ చెన్నైలో దిగారు. సీఎం తలపతి విజయ్‌ను కలిసినప్పుడు ఆయన చాలా సంతోషంగా కనిపించారు. గురువారం జ‌రిగిన కౌన్సిల్ స‌మావేశానికి కేంద్ర మంత్రి అధ్య‌క్ష‌త వ‌హించారు. షోర్ టెంపుల్‌లో ప్రార్థనలు చేశారు అమిత్ షా. ఇదిలా ఉండ‌గా దక్షిణ జోనల్ కౌన్సిల్‌లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ దక్షిణ జోనల్ కౌన్సిల్ వైస్-ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ సమావేశానికి దక్షిణ ప్రాంతంలోని సభ్య రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, నిర్వాహకులతో పాటు ప్రతి రాష్ట్రం నుండి ఇద్దరు సీనియర్ మంత్రులు హాజరయ్యారు. పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడానికి ఒక వేదికను కూడా కల్పించాల‌ని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని సమస్యలు, వివాదాలపై చర్చించారు.

Leave A Reply

Your Email Id will not be published!