Eatala Rajender : దొర గ‌డీల పాల‌న‌కు మూడింది

బీజేపీ సీనియ‌ర్ నేత ఈట‌ల రాజేంద‌ర్

Eatala Rajender : మాన‌కొండూరు – తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన దొర గ‌డీల పాల‌న‌కు మూడింద‌ని , ఇక కేసీఆర్ ప‌నై పోయింద‌ని ధ్వ‌జ‌మెత్తారు గ‌జ్వేల్ , హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ . ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మాన‌కొండూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థ‌ఙ ఆరేప‌ల్లి మోహ‌న్ త‌ర‌పున ప్ర‌చారం నిర్వ‌హించారు.

Eatala Rajender Comments on KCR

ప్రాజెక్టుల పేరుతో దోచుకున్న సొమ్మంతా క‌క్కిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. తాము అధికారంలోకి వ‌స్తే క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీపై విచార‌ణ జ‌రిపిస్తామ‌ని చెప్పారు. ఆ వెంట‌నే జైలుకు పంపించే ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు.

సంక్షేమ ప‌థ‌కాల పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న కేసీఆర్ ను సాగ‌నంపాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు ఈట‌ల రాజేంద‌ర్(Eatala Rajender). చిత్తు చిత్తుగా ఓడి పోవ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. తండ్రీ కొడుకుల‌కు , క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి చెక్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఎన్ని వ్యూహాలు ప‌న్నినా , ఎంత‌గా జిమ్మిక్కులు ప్ర‌ద‌ర్శించినా వ‌ర్క‌వుట్ కాద‌న్నారు. మొత్తంగా గంప గుత్త‌గా 119 స్థానాల‌కు గాను 60 సీట్ల‌కు పైగా బీజేపీకి వ‌స్తాయ‌ని జోష్యం చెప్పారు.

Also Read : Mandakrishna Madiga : తెలంగాణ‌లో బ‌హ‌జ‌నులు కీల‌కం

Leave A Reply

Your Email Id will not be published!