పెరిగిన ఓటింగ్ శాతం బెంగాల్ లో బీజేపీ విజ‌యం

ధీమా వ్య‌క్తం చేసిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ

ఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ దేశంలోని రెండు రాష్ట్రాల వైపు అంద‌రి క‌ళ్లు ఉన్నాయి. త‌మిళ‌నాడులో 234 స్థానాల‌కు, ప‌శ్చిమ బెంగాల్ లో తొలి విడ‌త‌లో 16 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను 156 శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌లో పోలింగ్ జ‌రుగుతోంది. ఈ సంద‌ర్బంగా గురువారం ప్ర‌ధాన‌మంత్రి స్పందించారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బెంగాల్ లో ఓటింగ్ శాతం పెరిగింద‌న్నారు. దీన్ని బ‌ట్టి చూస్తే ప్ర‌జ‌లు భార‌తీయ జ‌న‌తా పార్టీ వైపు చూస్తున్నార‌నేది తేలి పోయింద‌న్నారు. ఇక త‌మ విజ‌యాన్ని అడ్డుకోవ‌డం ఇండియా కూట‌మికి చేత కాద‌న్నారు. ఇక బెంగాల్ లో క‌మ‌లం జెండా ఎగుర వేయ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు మోదీ. అంతే కాకుండా గత 50 ఏళ్ల బెంగాల్ ఎన్నికల చరిత్రలో హింస చాలా తక్కువగా ఉందన్నారు.

త‌న‌కు ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఇది మార్పు కోసం వచ్చిన తీర్పు అని నేను ఖచ్చితంగా చెప్పగలను అని అభిప్రాయం వ్య‌క్తం చేశారు ప్ర‌ధాన‌మంత్రి. పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లా కృష్ణనగర్‌లో పశ్చిమ అసెంబ్లీ ఎన్నికల ముందు గురువారం జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో ఇప్పటివరకు భారీగా ఓటు వేసినందుకు పశ్చిమ బెంగాల్ ప్రజలను ప్రధానమంత్రి అభినందించారుఈ ఓట్ల సంఖ్య మార్పు కోసం వచ్చిన అఖండమైన తీర్పుకు సూచిక అని పేర్కొన్నారు. ప్రజలు భారీ సంఖ్యలో ఓటు వేయడానికి వచ్చినప్పుడల్లా బీజేపీ నిర్ణయాత్మక విజయాలు సాధించిందని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!