ప్ర‌పంచానికి భార‌త దేశం దిక్సూచి కావాలి : మోదీ

సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారిన టీవీకే చీఫ్

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ప్రధాని న‌రేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. గురువారం రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ కీల‌క స‌మావేశం జ‌రిగింది. “వికసిత్ భారత్ @2047 కోసం సమ్మిళిత మానవాభివృద్ధి” అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు , ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, సమ్మిళిత వృద్ధి వంటి కీలక అభివృద్ధి అంశాలపై ఇందులో చర్చలు జరిగాయి.

ఈ సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు , ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు హాజరయ్యారు. సహకార సమాఖ్య విధానానికి (cooperative federalism) ఇది అత్యున్నత వేదికగా నిలుస్తోంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాకారం చేసే లక్ష్యంతో విధాన పరమైన కార్యక్రమాలు, అభివృద్ధి వ్యూహాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించడానికి ఇది దోహద పడుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌లే త‌మిళ‌నాడులో సీఎంగా కొలువు తీరిన జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ హాజ‌ర‌య్యారు. ఈ సమావేశంలో ఆయ‌న సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు.

త‌ను ఇటీవ‌లే ఢిల్లీకి వెళ్లి వ‌చ్చారు. త‌ను కొలువు తీరిన తర్వాత రాజ‌ధానికి వెళ్ల‌డం ఇది మూడోసారి కావ‌డం విశేషం. త‌ను తొలుత ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంత‌రం రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తితో పాటు సీపీఐ, సీపీఎం పార్టీల చీఫ్ ల‌తో స‌మావేశం అయ్యారు. అక్క‌డి నుండి సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను క‌లుసుకున్నారు విజ‌య్.

Leave A Reply

Your Email Id will not be published!