హైదరాబాద్ : పర్యావరణానికి మేలు కలిగించేలా , మరింత ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉండేలా ప్రారంభానికి సిద్దమైంది తొలి స్వదేశీ హైడ్రోజ్ రైలు. ఈ ట్రైన్ జీంద్-సోనిపట్ సెక్షన్‌లో గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. 1200 కిలోవాట్ ఇంజన్ సామర్థ్యం గల 10-కోచ్‌ల రైలు సిద్ధం చేసింది. క్లీన్ , సుస్థిర రైలు రవాణా కు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వినియోగ ఎలైట్ దేశాల క్లబ్‌లో చేరింది భారత్. దీంతో పర్యావరణ పరిరక్షణ , హరిత ఇంధన దిశగా భారతీయ రైల్వే ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరింది.
దేశంలోనే పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించబడిన మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కడానికి సర్వం సిద్ధమైంది. సాంప్రదాయ ఇంధన వనరుల కంటే మరింత పర్యావరణ హితంగా, అత్యంత ఇంధన సామర్థ్యంతో ఈ రైలును డిజైన్ చేశారు.ఉత్తర రైల్వే పరిధిలోని జీంద్ – సోనిపట్ (Jind-Sonipat) సెక్షన్ లో ఈ రైలును నడపడానికి భారతీయ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మార్గంలో ఈ హైడ్రోజన్ రైలు గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది.
ఇక ఈ రైలులో మొత్తం 10 కోచ్‌లు (కంపార్ట్‌మెంట్లు) ఉంటాయి. ఇది 1200 కిలోవాట్ (KW) సామర్థ్యం గల శక్తివంతమైన ఇంజన్‌తో నడుస్తుంది.ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ (Hydrogen Fuel Cell) సాంకేతికతతో పని చేస్తుంది. దీని ద్వారా పర్యావరణానికి హాని చేసే కార్బన్ ఉద్గారాలు సమస్య ఉండదు. కేవలం నీటి ఆవిరి (Water Vapour) మాత్రమే పర్యావరణంలోకి విడుదలవుతుంది. ఈ వినూత్న సాంకేతికతను విజయవంతంగా అమలు చేయడం ద్వారా, క్లీన్ అండ్ గ్రీన్ రైల్వే ఆపరేషన్స్ కోసం హైడ్రోజన్ ఇంధనాన్ని వాడుతున్న ప్రపంచంలోని కొన్ని అత్యున్నత దేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచింది.
