అమరావతి : మంత్రి అనగాని సత్య ప్రసాద్ నిప్పులు చెరిగారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకిపారేశారు. ఇవాళ మంత్రి మీడియాతో మాట్లాడారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ కొత్తగా నేను చాలా అమాయకుణ్ణి, అహింసా వాదిని అని మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. వాళ్ళ పూర్వీకుల చరిత్ర, వాళ్ళ చరిత్ర ఏంటి అనేది ప్రపంచంలో అందరికి తెలుసు అన్నారు సత్య ప్రసాద్. ఎన్ని దారుణాలకు పాల్పడ్డారో. ఎన్ని హత్యలు చేశారో రాయలసీమలో ఏ గడపని అడిగినా చెపుతారన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం గురించి ఎవరిని అడిగినా కతలు కథలుగా చెప్తారన్నారు.అటువంటి రాజారెడ్డి పోలికలు నాకొచ్చాయి అని గర్వాంగా చెప్పుకున్న వ్యక్తి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి అని ఫైర్ అయ్యారు.
ఎస్ సి, ఎస్ టిలపై అరాచకాలు చేసి, హత్యలు చేసి.. వాళ్ళ చేత దొంగతనాలు చూపించిన చరిత్ర వాళ్ళదని సంచలన ఆరోపణలు చేశారు అనగాని సత్య ప్రసాద్. ఈ సైకో గొడ్డలిపార్టీ అధ్యక్షుడు చేసిన అరాచకాలు మనం కళ్లారా చూసాం అన్నారు. తన తండ్రి వైఎస్సార్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని ఇతని వ్యాపారానికి అడ్డుగా ఉన్న ప్రతి ఒక్కరినీ హతమార్చింది నిజం కాదా అని నిలదీశారు . పరిటాల రవితో సహా ఎంతో మందిని హత్య చేసిన వ్యక్తి జగన్ రెడ్డి అని భగ్గుమన్నారు. 5 సంవత్సరాలలో చంద్రయ్య లాంటి పార్టీకి విధేయంగా ఉన్నటువంటి వారిని పార్టీ మారమని గొంతు మీద కత్తిపెట్టి కోసి చంపిన సంఘటనలు చూశామన్నారు.