Konda Vishweshwar Reddy: తెలంగాణా ఎన్నికల్లో సరికొత్త రికార్డు ! కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఆస్తులు రూ. 4564.21 కోట్లు !

తెలంగాణా ఎన్నికల్లో సరికొత్త రికార్డు ! కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఆస్తులు రూ. 4564.21 కోట్లు !

Konda Vishweshwar Reddy: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ అభ్యర్థి సరికొత్త రికార్డు సృష్టించారు. ఏకంగా వేలకోట్ల ఆస్తులు అఫిడవిట్‌లో చూపించి అందరూ నోరెళ్లపెట్టేలా చేశారు చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి(Konda Vishweshwar Reddy). నామినేషన్‌లో భాగంగా కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి సోమవారం(ఏప్రిల్‌22) దాఖలు చేసిన అఫిడవిట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. విశ్వేశ్వర్‌రెడ్డి, ఆయన భార్య, కొడుకుకు కలిపి మొత్తం రూ.4488 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో చూపారు. వీటికి స్థిరాస్తులు కలిపితే మొత్తం ఆస్తులు 4564.21కోట్లు. ఈ ఆస్తులతో కొండా దేశంలోనే శ్రీమంతులైన రాజకీయనాయకుల్లో నెంబర్‌వన్‌గా నిలిచే చాన్స్‌ లేకపోలేదు.

Konda Vishweshwar Reddy – చరాస్తులివీ..

విశ్వేశ్వర్‌ రెడ్డికి చరాస్తులు రూ.1178 కోట్లు
విశ్వేశ్వర్‌ రెడ్డి భార్య సంగీతారెడ్డి చరాస్తులు రూ.3203 కోట్లు
విశ్వేశ్వర్‌ రెడ్డి కొడుకు విరాజ్‌ మాధవ్‌ చరాస్తులు రూ.107 కోట్లు

స్థిరాస్తులు ఇవే..

విశ్వేశ్వర్‌ రెడ్డికి స్థిరాస్తులు రూ.71.34కోట్లు
విశ్వేశ్వర్‌ రెడ్డి భార్య సంగీతారెడ్డి చరాస్తులు రూ.3.6 కోట్లు
విశ్వేశ్వర్‌ రెడ్డి కొడుకు విరాజ్‌ మాధవ్‌ చరాస్తులు రూ.1.27 కోట్లు

అప్పులు చాలా తక్కువ..

విశ్వేశ్వర్‌ రెడ్డికి అప్పులు రూ.1.76కోట్లు
విశ్వేశ్వర్‌ రెడ్డి భార్య సంగీతారెడ్డి అప్పులు రూ.12 కోట్లు

అపోలో కంపెనీలో షేర్ల వల్లే ?

విశ్వేశ్వర్‌ రెడ్డికి, ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తుల్లో ఎక్కువ భాగం అపొలో హస్పిటల్స్‌ గ్రూపునకు సంబంధించిన షేర్లే. విశ్వేశ్వర్‌రెడ్డికి అపోలోలో రూ.973కోట్ల విలువైన షేర్లు ఉండగా, ఆయన భార్యకు రూ.1500 కోట్ల విలువైన షేర్లున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి ఇప్పటివరకు అపోలో గ్రూపు షేర్లు స్టాక్‌మార్కెట్‌లో దూసుకుపోవడంతో మాజీ ఎంపీ ఆస్తుల విలువ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

ఇక భూముల విషయానికి వస్తే.. విశ్వేశ్వర్‌రెడ్డికి హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల మొత్తం 70 ఎకరాల భూమి ఉంది, ఆయన భార్యకు 14 ఎకరాల భూమి ఉంది. ఇవి కాకుండా 45432 స్క్వేర్‌ ఫీట్ల విస్తీర్ణం గల నివాస భవనాలున్నాయి. ఇక వాణిజ్య భవనాల విషయానికి వస్తే బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 12లో ఒకటి, ఉస్మాన్‌గంజ్‌లో 14 షాపులు, జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 86లో ఒక షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఉన్నాయి.

Also Read:M. Venkaiah Naidu: రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అందుకున్న వెంకయ్య నాయుడు !

Leave A Reply

Your Email Id will not be published!