హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత జనాదరణ పొందుతున్న దర్శకులలో కొరటాల శివ ఒకరు. తను జూనియర్ ఎన్టీఆర్, జాహ్నవి కపూర్ తో తీసిన మూవీ దుమ్ము రేపింది. బిగ్ సక్సెస్ అయ్యింది. ఇదే సమయంలో తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది. ప్రముఖ నటుడు, స్టార్ డమ్ కలిగిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తో కలిసి ఓ చిత్రాన్ని తీయబోతున్నట్లు టాక్. ఇందుకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. అయితే ఈ మూవీ గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం చేతులు కలపనున్నట్లు సమాచారం.
అలాగే 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కొరటాల శివ, బాలకృష్ణ. గత ఏడాది డిసెంబర్‌లో ‘అఖండ 2’ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించక పోవడంతో నందమూరి బాలకృష్ణ అప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన దర్శకుడు కొరటాల శివతో జత కట్టనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చివరి చిత్రం ‘దేవర’లో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించగా, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వాణిజ్య విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. బాలయ్య ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన వెంటనే, ‘శ్రీమంతుడు’ దర్శకుడైన కొరటాల శివతో కలయిక కార్యరూపం దాల్చనుంది. వీరిద్దరి కలయికకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
