న్యూఢిల్లీ : ప్రముఖ పంజాబీ సింగర్, నటుడు దిల్జిత్ దొసాంజే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసనలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. తాను కేవలం ఒక కళాకారుడిని మాత్రమేనని పేర్కొన్నాడు. కావాలని తనను ఇరికించే ప్రయత్నం చేయొద్దంటూ కోరాడు. ఇది మంచిది కాదన్నాడు. అయితే వ్యక్తిగా తాను అందరినీ గౌరవిస్తానని, తనకు కుల, మతాలతో సంబంధం లేదన్నాడు . నా మతం నాకు నేర్పింది ఒక్కటే అదేమిటంటే ఎదుటి వారిని ప్రేమించడం మాత్రమేనని పేర్కొన్నాడు దిల్జిత్ దొసాంజే.
ఇదిలా ఉండగా తాజాగా సీజేపీ చేపట్టిన నిరసనలపై దిల్జిత్ స్పందించాడు తీవ్రంగా. ‘మెయిన్ వాపస్ ఆవుంగా అనే మూవీలో నటించాడు కూడా. తన ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో పాల్గొని అభిమానుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆ నిరసనకు తనకు ఎటువంటి సంబంధం లేదన్నాడు. తాను రాజకీయ నాయకుడిని కాదని, కేవలం ఒక కళాకారుడిని మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. పరీక్షల్లో అవకతవకలు , నీట్ పేపర్ లీక్ వివాదంపై సీజేపీ చేపట్టిన నిరసనలో మీరు పాల్గొంటారా అని అడిగినప్పుడు దిల్జిత్ ఇలా అన్నారు: నన్ను వీటన్నింటికీ దూరంగా ఉంచండి… బ్రదర్ అని కోరాడు. ఆ తర్వాత ఆయన గురు గ్రంథ్ సాహిబ్‌లోని ఒక ప్రసిద్ధ వాక్యాన్ని ఉదహరించారు – “నానక్ దుఖియా సబ్ సంసార్, సో సుఖియా జిస్ నామ్ ఆధారా” (ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాధతో సతమతమవుతుంటారు, దేవుని నామాన్ని ఆశ్రయించిన వారు మాత్రమే సుఖంగా ఉంటారు).
