మున్సిపాలిటీలు, న‌గ‌ర పంచాయ‌తీల రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు

వివ‌రాలు వెల్ల‌డించిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మున్సిపాలిటీలు, న‌గ‌ర పంచాయ‌తీల చైర్ ప‌ర్స‌న్ల రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి వివ‌రాలు వెల్ల‌డించింది మున్సిప‌ల్ , ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ‌. గూడూరు ఎస్టీ మ‌హిళ‌, ఆళ్లూరు ఎస్టీ జ‌న‌ర‌ల్, ఆత్మ‌కూరు ఎస్టీ జ‌న‌ర‌ల్ కేటాయించారు. స్సీ కేట‌గిరిలో 14 స్థానాల‌ను కేటాయించారు. ఇందులో చింత‌ల‌పూడి ఎస్సీ మ‌హిళ‌, సూళ్లూరుపేట ఎస్సీ మ‌హిళ‌, కొండ‌ప‌ల్లి, నిడ‌ద‌వోలు, ఏలేశ్వ‌రం , గూటి, చీర్యాల‌ మ‌హిళ‌ల‌కు కేటాయించారు. వుయ్యూరు, సామ‌ర్ల‌కోట‌, పిఠాపురం, నూజివీడు, పామ్మ‌రు , పొదిలి , బాప‌ట్ల ఎస్సీ జ‌న‌ర‌ల్ కు ఛాన్స్ ఇచ్చారు. ఇక బీసీ కేట‌గిరీ కింద మొత్తం 36 స్థానాల‌ను కేటాయించింది స‌ర్కార్.
ఇందులో ఆళ్ల‌గ‌డ్డ బీసీ మ‌హిళ‌, సాలూరు, ఇచ్చాపురం, న‌ర్సీప‌ట్నం, ఎర్ర‌గుంట‌, జంగారెడ్డి గూడెం , పాల‌కొండ‌, తుని, పాల‌కొల్లు, క‌దిరి, పుంగ‌నూరు, రాజంపేట‌, గుడివాడ‌, రాజాం, గుంత‌క‌ల్లు, గూడూరు, నందికొట్కూరు, మ‌మ్మ‌డివ‌రం, పిడుగురాళ్ల మ‌హిళ‌ల‌కు ఛాన్స్ ఇచ్చారు. ఇక బీసీ జ‌న‌ర‌ల్ కేట‌గిరీ కింద పుత్తూరు, బేతంచ‌ర్ల‌, రామ‌చంద్రాపురం, స‌త్తెన‌ప‌ల్లి, శ్రీ‌కాళ‌హస్తి, మ‌ద‌న‌ప‌ల్లె, తాడిప‌త్రి, తిరువూరు, నంద్యాల‌, హిందూపూర్ , మ‌డ‌క‌శిర‌, నెల్లిమ‌ర్ల‌, పుట్ట‌ప‌ర్తి, పెనుకొండ‌, రాయ‌చోటి, తాడిగ‌డ‌ప‌, బి కొత్త‌కోట బీసీ జ‌న‌రల్ కు కేటాయించారు.

ఇక మ‌హిళ‌ల‌కు సంబంధించి జ‌న‌ర‌ల్ కోటాను ఖ‌రారు చేసింది స‌ర్కార్. మొత్తం 27 స్థానాలు కేటాయించింది. కానిగిరి , క‌మ‌లాపురం, కొవ్వూరు, వెంక‌ట‌గిరి, బుచ్చిరెడ్డిపాలెం, య‌ల‌మంచ‌లి, క‌ళ్యాణ దుర్గం, ఆత్మ‌కూరు, పాలంకాశీబుగ్గ‌, పెడ‌న‌, ప‌ల‌మ‌నేరు, జ‌మ్మ‌ల‌మ‌డుగు, అకివీడు, పొన్నూరు, భీమ‌వ‌రం, చిల‌క‌లూరిపేట‌, జ‌గ్గ‌య్య‌పేట‌, ఆముదాల‌వ‌ల‌స‌, మాచ‌ర్ల‌, ఆదోని, నాయుడుపేట‌, డోన్ , బొబ్బిలి, రేప‌ల్లె, పార్వ‌తీపురం, పులివెందుల స్థానాలు మ‌హిళ జ‌న‌ర‌ల్ కు కేటాయించారు. అన్ రిజ‌ర్వ్ డ్ కింద మొత్తం 26 స్థానాలు ఎంపిక చేశారు. తాడేపల్లిగూడెం , తణుకు, తేనాలి, గురజాల, అమలాపురం, ఎమ్మిగనూరు, కావలి, ప్రొద్దుటూరు, నందిగామ, కందుకూరు, మండపేట, దాచేపల్లి, నగరి, చీమకుర్తి, రాయదుర్గం, గిద్దలూరు, వినుకొండ, గొల్లప్రోలు, అద్దంకి, పెద్దాపురం, ధర్మవరం, బద్వేల్, దర్సి, మార్కాపురం, మైదుకూరు, నరసరావుపేట ఉన్నాయి.

Leave A Reply

Your Email Id will not be published!